హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena: జనసేన సభ కొత్త పొత్తులకు వేదిక కానుందా..? పవన్ ప్రకటనపై సస్పెన్స్.. ఆ నేత ఆశలు ఫలిస్తాయా..?

Janasena: జనసేన సభ కొత్త పొత్తులకు వేదిక కానుందా..? పవన్ ప్రకటనపై సస్పెన్స్.. ఆ నేత ఆశలు ఫలిస్తాయా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీ (Janasena Party) 9వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీ (Janasena Party) 9వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీ (Janasena Party) 9వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  Anna Raghu, Amaravati, News18­

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జనసేన పార్టీ (Janasena Party) 9వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభ ద్వారా జనసేన అధ్యక్షుడు జనసైనికులకు 2024 ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా ఈ సభ ద్వారా పవన్ కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీయనున్నారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి."ప్రజలకు సేవ చేయటానికి అధికారం ఉండాల్సిన అవసరంలేదు" గతంలో బాహాటంగానే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఇప్పటికైనా మార్పువచ్చుంటుందా అనేది ఆయన అభిమానుల ఆవేదన. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఐనా మనుగడ సాధించాలంటే ఆ పార్టీ అధికారం సాధించడం తప్పని సరి. లేదంటే క్యాడర్ ఎక్కువకాలం పార్టీలో నిలబడదు అనేది చారిత్రక సత్యం. అధికారపార్టీ నయానో భయానో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించడం సర్వసాధారణం.

  201లో టీడీపీకి మద్దతిచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. కానీ అధికారంలో మాత్రం పవన్ కళ్యాణ్ పాలుపంచుకోలేదు. తమ పార్టీ తరఫున అభ్యర్ధులను పోటీలో నిలబెడితే ఓట్లు చీలి అంతిమంగా వైసీపీకి లాభం చేకూరవచ్చనని అప్పట్లో పవన్ అభ్యర్ధులను నిలబెట్టలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే పవన్ సహాయంతో అధికారం చేజిక్కించుకునోన చంద్రబాబు నాయుడు మొదటిలో పవన్ కు కొంతమేర విలువ ఇచ్చినా ఆ తర్వాత ఆయనను అస్సలు పట్టించుకోలేదు. దీనికి తోడు టీడీపీ నేతలు పవన్ వల్లే తాము అధికారంలోకి రాలేదంటూ ఆయనపై విమర్శలు కూడా చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ - చంద్రబాబుల మధ్య బంధం తెగిపోయి ఇద్దరూ విడివిడిగా పోటీ చేసి దారుణమైన పరాజయాన్ని చవిచూశారు.

  ఇది చదవండి: ఆ జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే.. మరొకరు హర్ట్ అవుతారు.. జగన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

  అప్పటి నుండి ఓటమిని జీర్ణించుకోలేని పవన్ ఈ సారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు. పైగా 2014లో తన ఓటమికి పవన్ కళ్యాణ కారణం అనే అక్కసుతో జగన్ పవన్ సినిమాలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో జగన్ ను ఎలాగైనా సరే ఓడించాలని దీనికోసం కలిసి వచ్చే ఏపార్టీతోనైనా పొత్తుకు తాను సిద్ధం అని ఈ రోజు సభావేదికగా పవన్ ప్రకటించే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  ఇది చదవండి: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..

  పొత్తులపై పవన్ ప్రకటన కోసం అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడే. వచ్చే ఎన్నికలు ఇటు జనసేనకు, అటు టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అందుకే రెండు పార్టీలు భేషజాలకు పోకుండా కలిసిమెలిసి పనిచేసి తమ ఉమ్మడి ప్రత్యర్ధిని జగన్ న్ని ఓడించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన చేతులు కలపక పోతే జగన్ ను అధికారానికి దూరం చేయడం మరింతకష్టం అవుతుందని, అదే గనుక జరిగితే 2024 తరువాత ఈ రెండు పార్టీలు పూర్తిగా అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందంటూ కొందరు సినీ,రాజకీయ ప్రముఖుల ద్వారా పవన్ చంద్రబాబు.. పవన్ కు చెప్పించే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

  ఐతే ప్రస్తుతం జనసేన.. బీజేపీతో పొత్తులో ఉంది. పవన్, టీడీపీ బంధంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఓ పార్టీతో పొత్తులో ఉండగా... మరో పార్టీతో దోస్తీ ఎలా ఆసక్తికరంగా మారింది. వీటిన్నింటికీ తెరదించాలంటే పవన్ ప్రకటించేవరకు ఆగాల్సిందే..!

  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు