హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Updates: ఏపీ కేబినెట్లో మార్పులకు ముహూర్తం ఫిక్స్..? మంత్రులకు సీఎంఓ సమాచారం..?

AP Cabinet Updates: ఏపీ కేబినెట్లో మార్పులకు ముహూర్తం ఫిక్స్..? మంత్రులకు సీఎంఓ సమాచారం..?

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది.

  Anna Raghu, News18­, Guntur

  కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఉండేదెవరు.. పదవిని కోల్పోయేదవరనే దానిపై అందరి దృష్టి నెలకొంది. పనితీరు, సమర్ధత, సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాలు, ఇతర అంశాలపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీఎల్పీ సమావేశంలో కేబినెట్ మార్పులపై సీఎం జగన్ (CM YS Jagan) కామెంట్స్ చేయడంతో ఏ క్షణంలోనైనా కేబినెట్లో మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. సీఎం జగన్ తన సహచర మంత్రులకు ఈనెల 27న విందు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులకు ఆదివారం అందుబాటులో ఉండాలని సీఎం ఆఫీస్ నుండి కబురెళ్లిందని కూడా చర్చించుకుంటున్నారు.

  ఇదే నిజమైతే మంత్రి పదవి రెండున్నరేళ్లకే పరిమితమని చెప్పిన జగన్ రేపు జరగబోయే విందులో మంత్రి వర్యులను రాజీనామా అడిగే ఆలోచనలో కూడా ఉన్నట్లు తాడేపల్లి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 11న కొత్త మత్రులు ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఆ రోజు అన్ని విధాలుగా తిధులు ఇతర ఘడియలు బాగున్నాయని మరికొందరు చెబుతున్నారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో ఏపీలో ఈ పథకాలు అమలు చేయవచ్చు.. అవేంటంటే..!

  ఇక బడ్జెట్ సెషన్ కూడా ముగియడం, జిల్లాలపై కసరత్తు కూడా దాదాపు పూర్తికావడతో మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నందున కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ విధమైన పొరబాట్లు లేకుండా రాజకీయంగా, ప్రాంతీయంగా సామాజికవర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటికి పదిసార్లు సమీక్షించుకుని మరీ కొత్త మంత్రులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

  ఇదిచదవండి: లిక్కర్ మేటర్ ను వదలని టీడీపీ.. జే బ్రాండ్స్ పేరుతో వెబ్ సైట్..

  ఇక కొత్త మంత్రులుగా ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఇష్టమే అయినా ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో కత్తి మీద సాము వ్యవహారమే అని అంటున్నారు. ఎవరికి పదవి ఇచ్చినా ఎవరిని తప్పించినా అది తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది.

  ఇది చదవండి: వివేకా హత్య కేసులో మరో సంచలనం.. సీపీఐకి రఘురామ లేఖ..

  అందువల్ల ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఇక ఆశావహులను ఆయన పిలిపించుకుని మాట్లాడి ఏ కారణం చేత మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామో వివరిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం ద్వారా చాలావరకు అసంతృప్తి రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికి పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి వారికి హామీ ఇస్తారని తెలుస్తోంది. అదే టైంలో మాజీలు అవుతున్న మంత్రులకు ఇంతకంటే పెద్ద బాధ్యతలుగా పార్టీని అప్పగించాలని జగన్ అనుకుంటున్నారు.

  ఇది చదవండి: హైవేపై ఆరు వాహనాలు ఢీ.. బొమ్మలా నలిగిపోయిన కారు.. రోడ్డుపై షాకింగ్ సీన్..

  మీరే రేపటి రోజున పార్టీకి సారధులు పార్టీని మళ్ళీ గెలిపిస్తే మీ మంత్రి సీటు మీకే అని ఇప్పటికే వారికి జగన్ చెప్పేశారు. ఎంతలా చెప్పినా ఎన్ని రకాలైన హామీలు ఇచ్చినా మంత్రివర్గ విస్తరణ అంటే అలకలు అసంతృప్తులు ఉండడం సహజం. మరి జగన్ వాటిని ఏ విధంగా అధిగమిస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తే ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అని దాదాపుగా వైసీపీలో ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగిపోతోంది. మరి న్యూ మినిస్టర్లు ఎవరు అన్నదే చూడాల్సింది ఉంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు