Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATION OVER CABINET BERTH TO TAMMINENI SEETHARAM AS DHARMANA FAMILY STRONG OPPONENTS TO SPEAKER FULL DETAILS HERE PRN VSP

AP Politics: ఆ జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే.. మరొకరు హర్ట్ అవుతారు.. జగన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు సీఎం జగన్ (CM YS Jagan) సిద్ధమవుతున్నారు. ఉగాది నాటికి వైసీపీ (YSRCP) క్యాడర్ కూడా ఊహించలేని మార్పులు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ రాబోతున్నాయి.

    P Anand Mohan, Visakhapatnam, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు సీఎం జగన్ (CM YS Jagan) సిద్ధమవుతున్నారు. ఉగాది నాటికి వైసీపీ (YSRCP) క్యాడర్ కూడా ఊహించలేని మార్పులు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ రాబోతున్నాయి. ఇందులో ముఖ్యమైనది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. కేబినెట్ మార్పులపై ఇటీవల సీఎం కీలక వ్యాఖ్యలు చేయడంతో ఏ జిల్లాలో ఎవరికి అవకాశం వస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలక నేతగా ఉన్న ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్న మంత్రి పదవు వస్తుందా లేదా అనేది అటు శ్రీకాకుళం జిల్లాలోనూ చర్చనీయాంశమైంది.

    శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి తమ్మినేని ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తొలుత టీడీపీ తరపున గెలిచిన ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఐతే ఎర్రన్నాయుడుతో విభేదాల కారణంగా ఆయన 2009లో పీఆర్పీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చి.. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019 గెలిచి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. ఐతే మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.

    ఇది చదవండి: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..


    ఐతే వైసీపీ అధిష్టానం తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా.. ఆయనకు ఓ ప్రధాన అడ్డంకి ఉందన్న ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రూపంలో తమ్మినేనికి ఇబ్బందులు తప్పేలా లేవు. తమ్మినేని మాదిరిగానే ధర్మాన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కృష్ణ దాస్ మంత్రిగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇస్తే.. కృష్ణదాస్ ను తొలగించాలి. ఒకవేళ అలా చేసినా ఒకే కుటుంబానికి పదవులిస్తున్నారన్న విమర్శను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రసాదరావు కంటే ముందు కృష్ణ దాసు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు. ప్రసాదరావు మాత్రం వైసీపీలో చేరకముందు జగన్ తీవ్రవిమర్శలు చేశారు. ఈ కారణంతోనే ఆయనకు పదవి దక్కలేదన్న ప్రచారమూ ఉంది.

    ఇది చదవండి: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..


    మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మూడు దశాబ్దాలుగా తమ్మినేని, ధర్మాన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తమ్మినేని టీడీపీలో ఉండగా.. ధర్మాన కాంగ్రెస్ లో చక్రం తిప్పేవారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ఇప్పుడు తమను కాదని తమ్మినేని సీతారామ్ కు మంత్రిపదవి ఇస్తే.. ధర్మాన గ్రూప్ అసంతృప్తికి లోనవుతుంది. అలాగని ధర్మాన కుటుంబానికి ఇచ్చినా తమకు అన్యాయం చేశారంటూ తమ్మినేని వర్గం నుంచి అసమ్మతిని ఎదుర్కోక తప్పదు. మరి వీళ్లిద్దరి విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, AP Speaker Tammineni Seetharam, Ysrcp

    తదుపరి వార్తలు