ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పొత్తుల రాజకీయం జోరుగా నడుస్తోంది. రెండు ప్రదాన పార్టీలు ఇప్పటికే జనసేన (Janasena) వైపు చూస్తున్నాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పవన్ (Pawan Kalyan) కు డైరెక్ట్ ఆఫర్స్ ఇస్తుంటే మరోవైపు బీజేపీ (BJP) ఇప్పటికే పవన్ మాతో ఉన్నాడని.. జనసేనతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది. అయితే ఏడాది క్రితం నుంచే చంద్రబాబు పవన్ తో పొత్తు కోసం తహాతహాలాడుతున్నారు. అయితే ఈ పొత్తుల విషయంలో టీడీపీ, బీజేపీ చాలా క్లారీటిగా తమ వైఖరి ఎలా ఎందో ఇప్పటికే బహిరంగంగా చెప్పిన జనసేనా మాత్రం ఈ విషయంలో కాస్త కన్ఫూజన్ లో ఉన్నట్లు సమాచారం. మొన్న జనసేన ఆవిర్భవ సభలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాకుండా ఉండాలంటే ఎవరితోనైన పొత్తు కలిసి అడుగులు వేస్తోనని చెప్పారు.
అయితే అప్పుట్లో పవన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో జత కలవబోతున్నారని అందరు భావించారు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత టీడీపీ నుంచి ఎన్ని సానుకూల సంకేతాలు వచ్చినా పవన్ నుంచి మాత్రం ఆ పార్టీతో పొత్తులకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే తాజాగా కర్నూలు టూర్ లో మళ్లీ పొత్తుల గురించి మాట్లాడిన పవన్ ఈసారి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. అన్ని బలమైన పార్టీలో కలిసి రావాలని మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జగన్ అధికారంలోకి వస్తాడని అది జరిగితే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి రెండు రోజుల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు.., పవన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా అందరూ కలిసివస్తే తాను ఏ త్యాగానికైన సిద్దమని ప్రకటించారు. అయితే ఇక్కడ పవన్ పదే పదే అన్ని బలమైన పార్టీలు కలిసిరావాలని వ్యాఖ్యలు చేస్తోన్నప్పటికీ అన్ని బలమైన పార్టీలు కలిసి వస్తే పవన్ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్కడ చెప్పడం లేదు.
జనసేన ఎవరితో కలిసి అడుగులు వెస్తోందనే అంశంపై ఇప్పటికి గోప్యంగానే ఉంచుతున్నారు పవన్. మరో వైపు పవన్ ను ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పవన్ టీడీపీతో కలిస్తే తాము కూడా పవన్ వెంట నడవడానికి ఒప్పుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ.., జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీని ఒక్కరిని చేస్తే జనసేన బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినట్లు అవుతుందని.., అప్పుడు మళ్లీ పవన్ అభిప్రాపడినట్లు వైసీపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయాని కదా..! మరి ఈ చిన్న లాజిక్ ను ఎందుకు బీజేపీ మర్చిపోతుందని అభిప్రాపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు పవన్ మాత్రం అటు బీజేపీ.., ఇటు టీడీపీ చేస్తోన్న వ్యాఖ్యల పట్ల పెద్దగా స్పందించడం లేదు. రాష్ట్రానికి ఎది మేలు చేస్తుందంటే అదే చేస్తానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అవసరమైతే త్వరలో ఢిల్లీ వెళ్లి ఇక్కడ జగన్ చేస్తున్న అవకతవకలుపై ప్రధానికి వివరిస్తానని ఆయన అంటున్నారు. ఒక వైపు టీడీపీ తో పొత్తుకు పవన్ సముఖంగా ఉన్న ఇదే అంశంపై ఆయన ఇప్పుడే స్పందించాలని అనుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో కలిస్తేనే పవన్ జగన్ కు చెక్ పెట్టగలుగుతాడని అభిప్రాపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ పొత్తులకు సంబంధించి పార్టీ కార్యలయం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ ఒప్పించి మరి పవన్ చంద్రబాబు కూటమి వైపు ఆ పార్టీని తీసుకురాబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.