హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP CMO: ఏపీ సీఎంఓలో కోవర్టులున్నారా..? ఆ పార్టీకి సమాచారం లీక్.. ఆ వ్యక్తిపైనే అనుమానం..!

AP CMO: ఏపీ సీఎంఓలో కోవర్టులున్నారా..? ఆ పార్టీకి సమాచారం లీక్.. ఆ వ్యక్తిపైనే అనుమానం..!

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

AP CMO: రివ్యూల సమయంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు చేసే ప్రతిపాదనలు, వ్యాఖ్యలు బయటకురావు. కానీ ఒక్కోసారి అవి బయటకు వచ్చినప్పుడు రాజకీయ దుమారం రేగుతుంటుంది. అలాగే కొన్ని కీలక అంశాలు, సమాచారం లీక్ అయితే అది ప్రతిపక్షాలకు ఆయుధాన్నిచ్చినట్లే అవుతుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ప్రతి ప్రభుత్వంలో అన్ని అంశాలు పక్కాగా జరుగుతుంటాయి. ప్రజలకు చెప్పేవాటితో పాటు చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా రివ్యూల సమయంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు చేసే ప్రతిపాదనలు, వ్యాఖ్యలు బయటకురావు. కానీ ఒక్కోసారి అవి బయటకు వచ్చినప్పుడు రాజకీయ దుమారం రేగుతుంటుంది. అలాగే కొన్ని కీలక అంశాలు, సమాచారం లీక్ అయితే అది ప్రతిపక్షాలకు ఆయుధాన్నిచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంఓ (Andhra Pradesh CMO) అలాంటి పరిస్థితే నెలకొందన్న వార్తలు వస్తున్నాయి. సీఎంఓ అంటే ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం. రాష్ట్ర పరిపాలన అంశాలపై కీలక నిర్ణయాలు ఇక్కడి నుండే తీసుకుంటారు. అక్కడంతా ముఖ్యమంత్రి నమ్మిన బంటులే ఉంటారు.. ఉండాలి కూడా.

  కానీ ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ అంశంపై చర్చ జరిగినా అది పిన్ టు పిన్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి చేరిపోతుందట. అక్కడ ఏం జరిగినా ఆ పార్టీ ముఖ్యనేత నారా లోకేశ్ (Nara Lokesh) కు వద్దకు వెళ్లిపోతుందట.

  ఇది చదవండి: ప్రమోషన్ ఇస్తామన్న వద్దంటున్నారు..! ఏపీలో ఎంఈఓ పోస్టులపై ఆసక్తిచూపని టీచర్లు.. కారణం ఇదేనా..?

  అంతేకాక ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న స్పందన, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి కీలక పథకాల అమలు, నిధుల కేటాయింపుల వివరాలు సైతం ప్రతిపక్ష నారా లోకేశ్ కు చేరవేస్తున్నట్లు మసాచారం. దీంతో ఆ సమాచారంతోనే అసెంబ్లీలో, మండలిలో టీడీపీ సభ్యుల.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారట. పక్కా సమాచారంతో సభలో ప్రశ్నిస్తండటంతో అధికార పార్టీకి కూడా కాస్త షాకింగ్‌‌‌ గానే అనిపిస్తోందట. దీంతో అధికార పార్టీ సభ్యులు కాస్త ఇబ్బంది పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వెనుక అసలు కారణం ఇదేనా ?

  ఐతే కీలక సమాచారాన్ని కొందరు వ్యక్తులు సీఎంఓ నుంచే టీడీపీకి లీక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ (AP CM YS Jagan) వద్దకు కూడా చేరిందట. దీంతో సీఎంఓను ప్రక్షాళణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఐతే టీడీపీ హయాంలో వచ్చిన కొందరు అధికారులు సమాచారం లీక్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సీఎం వద్దకు చేరినట్లు సమాచారం.

  అంతేకాదు సీపీఎస్ రద్దు వ్యవహారంలో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న కొందరు ఉద్యోగులు వారివారి శాఖల్లోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారన్న అనుమానాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ డేటా యాక్సెస్ కూడా కలిగిన ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తిని అక్కడి నుంచి తప్పించడమే కాకుండా.. సీఎంఓ మొత్తాన్ని ప్రక్షాళన చేసేదిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

  ఉత్తమ కథలు