Home /News /andhra-pradesh /

AP POLITICS SOME OF YSRCP MPS THINKING TO CHANGE THEIR POLITICAL PLANS BEFORE 2024 ASSEMBLY ELECTIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

YSRCP: జగన్ ఒకటి తలిస్తే ఎంపీలు మరొకటి తలుస్తున్నారా..? వైసీపీకి కొత్త తలనొప్పులు

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసీపీ నేతలంతా ఉత్సాహంగా కనిపించారు. తొలి ఏడాదంతా విజయం సాధించామన్న ఆనందంతో గడిపేశారు. ఐతే రానురాను పరిస్థితులు మారుతూ వచ్చాయి.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసీపీ నేతలంతా ఉత్సాహంగా కనిపించారు. తొలి ఏడాదంతా విజయం సాధించామన్న ఆనందంతో గడిపేశారు. ఐతే రానురాను పరిస్థితులు మారుతూ వచ్చాయి. క్రమంగా పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. అన్ని విషయాల్లో సమన్వయంతో ముందుకెళ్లాల్సిన వారు కాస్తా ఎడమొహం పెడమొహంగా మారిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మధ్య తేడాలొచ్చాయి. అధిపత్యపోరు, తమ మాట నెగ్గాలన్న పంతం వెరసి వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో జగన్ కు తలనొప్పులు తప్పడం లేదు. ఈ విషయంలో ఎంపీలు విసిగిపోయినట్లు టాక్. ప్రస్తుతం రఘురామకృష్ణం రాజును మినహాయిస్తే మిగిలిన 21 మంది ఎంపీల్లో దాదాపు 90శాతం మంది మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి వారంతా ఎమ్మెల్యేలుగానే బరిలో దిగాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

  ప్రస్తుతం తమ కంటే ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఉందని.. ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో పర్యటించేందుకు అవకాశం లేకపోవడం, కొన్ని కార్యక్రమాలకు కనీసం ఆహ్వానం లేకపోవడంతో అసంతృప్తితో రగలిపోతున్నారు. ఎక్కడ పర్యటించాలన్నా లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలనేంతగా పరిస్థితులు మారిపోయాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పొలిటికల్ గా కేడర్ కు దూరమైపోతున్నామన్న భావన ఎంపీల్లో గట్టిగానే కనిపిస్తోంది.

  ఇది చదవండి: బీజేపీకే జై కొట్టిన జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి వైసీపీ మద్దతు..


  దీంతో చాలా మంది 2024లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలో దిగితే బెటర్ అని భావిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నా స్థానికంగా పర్యటిస్తున్నది చాలా తక్కువ. అంతేకాదు ఆయన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఎమ్మెల్యేగా మంత్రి బొత్స ఉన్నారు. దీంతో సాధారణంగానే ఆయన డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈసారి ఎలాగైనా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. బొత్సవారసుడికి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చి.. తనకు చీపురపల్లి అసెంబ్లీ ఇవ్వాలనేది సిట్టింగ్ ఎంపీ ప్రతిపాదన.

  ఇది చదవండి: మరో పథకానికి జగన్ సర్కార్ మంగళం..? లబ్ధిదారులను సైలెంట్ గా తప్పిస్తున్నారా..?


  ఈ లిస్టులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే మాగుంట ఫ్యామిలీ మొదట్నుంచీ ఎంపీ పదవికే పోటీచేస్తూ వస్తోంది. శ్రీనివాసులు రెడ్డి సోదరుడు, వదిన ఎంపీలుగా చేశారు. ఐతే ఈసారి మాత్రం మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారట. మాగుంట ప్రతిపాదనకు సీఎం జగన్ ఓకే చెబితే.. మార్కాపురంగానీ, గిద్దలూరు గానీ కోరే అవకాశమున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: వైసీపీకి ఎమ్మెల్యేకి టీచర్ ఉద్యోగం.. పాతికేళ్ల తర్వాత రిజల్ట్స్.. డీఎస్సీలో జాబ్


  కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొందట. ఇక్కడ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నానికి పడటం లేదు. దీంతో తీవ్ర అసహనంతో ఉన్న బాలశౌరి.. ఈసారి బందరు బరిలో ఆయన తనయుడ్ని బరిలో దించాలని యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అటు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి, మంత్రి విడదల రజనీకి పడటం లేదు. ఎంపీని.. మంత్రి అస్సలు పట్టించుకోవడం లేదు. చిలకలూరిపేటలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఎంపీని అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంపీకంటే ఎమ్మెల్యేగానే పోటీచేస్తే బెటరని ఎంపీ లావు భావిస్తున్నట్లు సమాచారం.  అటు రాయలసీమలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ బీసీని బరిలో దించితే గెలుపుఖాయమని వైసీపీ సర్వేలో లేలడంతో ఆ స్థానంలో తానే కరెక్ట్ అని ఆయన వైసీపీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. మరీ లెక్కల్లో ఎంత నిజముంది.. ఎంపీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసే నేతల్లో ఇంకెంతమంది బయకు వస్తారో వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు