హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: టీడీపీ వైపు చూస్తున్న ఆ నేతలు..? సొంతగూటికి వెళ్లే యోచనలో నలుగురైదుగురు..? బాబు గ్రీన్ సిగ్నల్..?

TDP: టీడీపీ వైపు చూస్తున్న ఆ నేతలు..? సొంతగూటికి వెళ్లే యోచనలో నలుగురైదుగురు..? బాబు గ్రీన్ సిగ్నల్..?

మహానాడులో చంద్రబాబు (ఫైల్)

మహానాడులో చంద్రబాబు (ఫైల్)

మహానాడు (Mahanadu) సక్సెస్ టీడీపీ (TDP)కి చాలా ప్లస్ అవుతోంది. ఇప్పటిదాకా వైసీపీ (YSRCP) వైపు, బీజేపీ వైపు చూసిన ఆ నేతలందరూ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఒకప్పటి టీడీపీ నేతలైన ఆ నాయకశ్రేణి నేరుగా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వలస రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందట.

ఇంకా చదవండి ...

  M Bala Krishna, News18, Hyderabad

  మహానాడు (Mahanadu) సక్సెస్ టీడీపీ (TDP)కి చాలా ప్లస్ అవుతోంది. ఇప్పటిదాకా వైసీపీ (YSRCP) వైపు, బీజేపీ వైపు చూసిన ఆ నేతలందరూ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఒకప్పటి టీడీపీ నేతలైన ఆ నాయకశ్రేణి నేరుగా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వలస రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందట. దీనికి తగ్గట్టు టీడీపీ అధినేత నుంచీ సంకేతాలు కూడా వచ్చాయన్నది బయట టాక్. వైసీపీ (YSRCP) పై వ్యతిరేకతను అన్ని విధాలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్న టీడీపీకి వీరి ఆగమనం కాస్తంత నిట్టూర్పు కలిగించే అంశమే. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి ఫక్తు టీడీపీ నేతలు. బీజేపీ నుంచీ టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న కామినేని శ్రీనివాస్, లంకా దినకర్ టీజీ వెంకటేశ్, వంటినాయకులు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం.

  2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవం తర్వాత మెల్లిగా తట్టా బుట్టా సర్దుకుని బీజేపీ గూటికి చేరారు కొందరు నేతలు. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలు టీడీపీని వీడారు. ఇదంతా చంద్రబాబు స్కెచ్ అని మొదట్లో వైసీపీ నానా యాగీ చేసింది. తర్వాత అంతగా ఆ విషయం పై మాట్లాడలేదు. అయితే చంద్రబాబుకి ఇప్పటికీ ఆ బీజేపీ నేతలు మద్దతుగానే ఉన్నారని.. వారు బీజేపీలో ఉన్నా టీడీపీ సానుభూతి పరులేనన్నది వైసీపీ అధికార వర్గాల ఆరోపణ. పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీని ఆ నేతలెవ్వరూ ఏనాడూ పల్లెత్తు మాటనలేదు. అలాగని ఏనాడూ ఓపెన్ గా టీడీపీకి సపోర్ట్ గా నిలవలేదు.

  ఇది చదవండి: నాకళ్లు చెమర్చాయి.. వాళ్లకు చేతులెత్తి మొక్కుతా.. దావోస్ టూర్ పై ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..


  ఇప్పుడు బీజేపీ నుంచీ వీడిపోవడానికి కూడా రెడీ అవుతున్నారట. ఆ నేతలందరూ బీజేపీ నుంచీ బయటకు వచ్చి టీడీపీ చేరడానికి రూట్ మ్యాప్ వేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి వ్యతిరేక వస్తోంది. ప్రభుత్వ విధానాలపై కాస్తంత గట్టిగానే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. దీన్ని టీడీపీ బాగానే వాడుకోవాలని ఫిక్స్ అయిపోయింది. మొన్నటి మహానాడు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబు అండ్ బృందంలో జోష్ పెరిగింది. స్పీడ్ మరింత పెంచి వైసీపీని ఇబ్బంది పెట్టాలన్నది టీడీపీ స్కెచ్. అదే స్థాయిలో గతంలో తమకి బలంగా అండగా ఉన్న నేతల్ని.. ఆయా పార్టీల నుంచీవెనక్కి పిలుచుకునే ప్లాన్ కూడా వేసింది. అలాగే వైసీపీ నుంచీ కూడా పనిలో పనిగా కొందరు నేతలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోందని సమాచారం.

  ఇది చదవండి: ఆ మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? జనసేన-బీజేపీ-టీడీపీ లెక్కలేంటి..?


  చాలాకాలంగా వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి అధికార పార్టీలో ఇమడలేకపోతున్నారు. తొందరలోనే టీడీపీలోకి మారిపోయే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇంతలో ఆత్మకూరు బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపధ్యంలో హఠాత్తుగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి ఆత్మకూరు సీటుపై కన్నేశారు. పార్టీ తరపున తాను ఆత్మకూరులో పోటీచేస్తానంటు ఆమె నారా లోకేష్ ను కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చారట. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆనంతో పాటు ఆయన కుమారుడు చెంచుసుబ్బారెడ్డి, దివంగత మాజీ ఎంఎల్ఏ ఆనం వివేకానందరెడ్డి కొడుకు రంగమమయూర్ రెడ్డి కూడా పోటీకి రెడీ అయిపోతున్నారట.

  ఇది చదవండి: ఇకపై వార్ వన్ సైడే.. గ్రూపులు కడితే గెట్ ఔట్.. చంద్రబాబు కామెంట్స్


  ఇక సీఎం రమేష్, లంకా దినకర్, సుజనా చౌదరి కూడా తిరిగి టీడీపీ లోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. బీజేపీని వీడకపోతే.. ఇబ్బందులు పడతామనే భావన వీరిలో కలిగిందని తెలుస్తోంది. అలాగే టీడీపీలోకి వెళ్లడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఎలక్షన్ ఫీవర్ రాకముందే పార్టీలో చేరితే.. ఆ తర్వాత పదవుల విషయంలో ఒక క్లారిటీ వస్తుందన్నది బయట వినిపిస్తోన్న మాట. టీడీపీకి ఇప్పటికే కాస్తంత పట్టున్న నేతల అవసరం ఉంది. అందుకే వీరు కూడా అదే వైపు చూస్తుండటంతో టీడీపీకి ఇప్పుడు వీరి అవసరం ఉందనేది పరిశీలకుల మాట. ఆర్ధిక పరిపుష్టి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయగల సామర్ధ్యం ఉన్న నాయకులు కూడా ఈనేతలకు తెలుసు. అలాగే సొంతగూటికి చేరడంలో ఎలాంటి నష్టం లేదని బీజేపీ నేతలు అంచనా.

  ఇది చదవండి: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..?


  మరోపక్క బీజేపీకి వీరి రూపంలో కొత్త తలనొప్పులు మొదలైనట్టే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగా ప్రకటించి తమ పని అయిపోయిందని అనిపించుకుందామని బీజేపీ బావించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ప్రకటన కానిచ్చేసి.. తాంబూలాలిచ్చాం తన్నుకుచావండని చెప్పేద్దామని అనుకుంది. టీడీపీకి కూడా ఇది చెక్ పెట్టే అంశం అవుతుందని తొలుత భావించింది. అయితే పొత్తుల విషయంలో ఒక నిర్ణయానికి మూడు పార్టీలు రాలేకపోవడం.. ఇప్పట్లో తేలని అంశంపై వేలాడటం ప్రస్తుత బీజేపీ నేతలకు కుదరడం లేదట. అందుకే బీజేపీని వీడటం ఖాయంగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని వెనకేసుకు వస్తున్నట్టు టాక్ ఉంది. పాత స్నేహబంధం విషయాన్ని ఆయన గుర్తుంచుకున్నారట. అందుకే స్నేహ హస్తాన్ని చాచి ఉంచారని తెలుస్తోంది. అయితే బీజేపీకి టీడీపీ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితి జనసేనది.

  ఇది చదవండి: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!


  మొత్తం మీద ఏపీ బీజేపీ నేతలు సొంతగూటికి రావడం అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అది ఎప్పుడా అన్నదే ఇంకా క్లారిటీ రాని అంశం. ఇప్పట్లో ఏపీలో వైసీపీకి వ్యతిరేకత పెరగడం మినహా నాయకత్వ లేమి లేదు. అయితే టీడీపీ మాత్రం పుంజుకోవాలంటే ఇప్పట్నించే చాలా చేయాల్సి ఉందంటారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంత తక్కువేసుకున్నా టీడీపీకి 35 శాతం ఓటు బ్యాంకుంది. దీన్ని 40 శాతంకు పెంచుకోవాలంటే చంద్రబాబు రీజనబుల్ గా వ్యవహరించాలి. పార్టీలోని యువతకు పెద్దపీట వేయాలి. టికెట్ల కేటాయింపులో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఈ నేతల సంగతి ఏమి జరుగుతుందో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: \, Andhra Pradesh, Ap bjp, TDP, Ysrcp

  ఉత్తమ కథలు