Home /News /andhra-pradesh /

AP POLITICS SOME KEY LEADERS READY TO JOIN TELUGU DESAM PARTY IN KADAPA THIS THE REASON NGS

Telugu Desam: సీఎం సొంత జిల్లాల్లో టీడీపీలో చేరికలకు ఎందుకంత డిమాండ్.. ఆ నియోజకవర్గంపై ముగ్గురు కర్ఛీఫ్..

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Telugu Desam Party: వైసీపీకి ఆ జిల్లా కంచుకోట.. అందులోనూ సీఎం జగన్ సొంత జిల్లా.. కానీ అలాంటి చోటు టీడీపీ లో చేరికలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఓ నియోజకవర్గ సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని ఆహ్వానించాలి అన్నది తెలుగు దేశం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

ఇంకా చదవండి ...
  Telugu Desam Party: ఉమ్మడి కడప జిల్లా (Kadapa District) ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కి కంచుకోట.. కానీ అది గతం.. వైఎస్ ప్రభంజనం మొదలవ్వడంతో.. టీడీపీ (TDP) అడ్రస్ గల్లంతైంది. ఒక్క సీటు గెలిస్తే గొప్ప అనుకునేంతగా మారింది. నాడు వైఎస్‌ చేతిలో.. నేడు సీఎం జగన్ (CM Jagan) చేతిలో రెండు దఫాలుగా ఓడి.. సైకిల్ పూర్తిగా పంక్చర్ అయ్యింది. చంద్రబాబు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ (TDP) . 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ (TDP) కేడర్‌ చెల్లాచెదురైంది. పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం కాగానే ఎవరిదారి వారు చూసుకున్నారు. టీడీపీ అంటే అభిమానం కలిగిన వారు మాత్రం ఈ మూడేళ్ల కాలంలో తమ శక్తిమేరా పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇటిటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ... జిల్లాలో పర్యటించడంతో వారిలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల మహానాడు (Mahanadu) తర్వాత పార్టీ కదలికలు జిల్లాలో పెరిగాయి. ఇదే సమయంలో పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతుండడం మరో సమస్యకు కారణమవుతోంది.

  గతంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (Varadarajula Reddy) , కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి (Veera Shiva Reddy) , మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) కొంతకాలంగా టీడీపీలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. అధికారపార్టీపై విమర్శలు చేస్తూనే తమ ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ను కలిసి పార్టీలో రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబుతో మాట్లాడి స్పష్టత ఇస్తామని లోకేష్‌ ఆయనకు బదులిచ్చారట. అయితే సానుకూలంగానే ఆయన ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారని తెలియడంతో కమలాపురం టీడీపీలో కలకలం మొదలైంది.  గత కొద్ది నెలల క్రితం మాజీ మంత్రి డీఎల్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. ఆయనకు పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదట. మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్‌.. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అభిప్రాయం మేరకు డీఎల్‌ను చేర్చుకుంటామని చెప్పారట. అయితే వీరశివారెడ్డికి మాత్రం లైన్‌ క్లియరైనట్టు ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు కడప పార్లమెంట్‌స్థాయి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాత నేతల చేరికలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సమన్వయకర్తగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎదుటే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డిని తిరిగి టీడీపీలోకి రప్పించేందుకు అక్కడి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : యువత అంటే అంత చులకనా..? ఆ హామీ అమలయ్యేదెప్పుడు అని చంద్రబాబు ప్రశ్న

  ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఉన్నారు. బీటెక్‌ రవికి నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలతో పడటం లేదట. వారే సతీష్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథిరెడ్డి, తొండూరు మండల నేతలు తదితరులు సతీష్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం రాంగ్‌ సిగ్నల్ పంపుతోందని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే బీటెక్‌ రవి సూచనల మేరకే సతీష్‌రెడ్డి దగ్గరకు వెళ్లామని వారు చెబుతున్నారట. మొత్తానికి కీలక జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న టీడీపీ.. కొత్త నేతల చేరిక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా..? మేలు చేస్తుందా అన్నది చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kadapa, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు