Home /News /andhra-pradesh /

AP POLITICS SOME AP SENIOR NEW MINSTER NOT HAPPY WITH JAGAN DECISION WHY THE FEEL BAD NGS BK

AP New Minsters: మంత్రి ప‌ద‌వులు ఇచ్చినా అసంతృప్తే.. సీనియర్ల అలకపాన్పుకు కారణం అదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP New Minsters: మంత్రి వర్గ విస్తరణ రచ్చ ఇంకా సాగుతోంది. రోజుకు ఒకరు చొప్పున వచ్చి సీఎంను కలిసి.. భరోసా దక్కించుకుంటున్నారు. అయితే బయటకు చెప్పక పోయినా.. సీనియర్ మంత్రులు లోలోనే అసమ్మతితో ఉన్నట్టు తెలుస్తోంది.

  AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జనగ్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన కేబినెట్ ను  విస్త‌రించిన తరువాత  రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. కేబినెట్ లో చోటు ద‌క్కించుకోని నేత‌లు ఇప్ప‌టికే అల‌కపానుపులు ఎక్కుతుంటే..  అలా గుర్తించిన వారందరినీ.. అదే సమాజిక  వర్గానికి చెందిన నేతలతో బుజ్జగింపుల ప్రక్రియ చేపడుతున్నారు సీఎం.  సామాజిక వ‌ర్గాల‌గా ఉన్న నేత‌లు బుజ్జ‌గించే పనిలో ప‌డ్డారు. పదవి రాని వారు బాధ పడడం.. అధిష్టానంపై అలగడం ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే.. కానీ కేబినెట్ పదవులు దక్కిన వారు కూడా.. అలక పాన్పు ఎక్కారనే ప్రచారం ఉంది. అది కూడా జగన్ అధినేతగా ఉండే పార్టీలో ఇలాంటి పరిస్థిని ఎవరూ ఉహించలేదు. సాధారణంగా వైసీపీలో అధినేత జగన్ ఎంత చెబితే అంతే.. రెండో మాటకే ఛాన్స్ ఉండదు..  కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.

  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇదే హాట్ టాపిక్ అవుతోంది. కేబినెట్ పదవులు దక్కించుకున్న నేతలు కూడా.. జ‌గ‌న్ తీరుపై అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొదట అంద‌ర్ని మార్చేస్తా అన్న జ‌గ‌న్ త‌రువాత పార్టీలో ఉన్న సీనియ‌ర్ల ఒత్తిడికి త‌లొగ్గ‌క త‌ప్ప‌లేదు. బొత్స‌ సత్యనారాయణ (Botsa Satyanarayna), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramchandra Reddy) లాంటి నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని మీడియా ముందు స్వాగ‌తించిన లోప‌ల మాత్రం వ్య‌తిరేకించారు. అందులో భాగంగా పాత మంత్రుల‌తో చివ‌రి కేబినేట్ ముగిసిన త‌రువాత బొత్స త‌న చాంబ‌ర్ లో కొంత మంది ఎమ్మెల్యేల‌తో ర‌హాస్య భేటీలు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.

  ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో పాత కేబినేట్ లో ఉన్న కొంత మంది మంత్రుల‌ను మ‌ళ్లీ కొత్త కేబినేట్ లో కూడా జ‌గ‌న్ కొన‌సాగించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఇదే జ‌గ‌న్ మోహాన్ రెడ్డి కొంప ముంచింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంద‌ర్ని గంప‌గుత్త‌గా మ‌ర్చేస్తే ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చుండేదే కాద‌ని పాత వాళ్ల‌ను కొంత మందిని  కొన‌సాగించ‌డం వ‌ల‌న జ‌గ‌న్ ఉహించ‌న స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

  ఇదీ చదవండి :ఆ గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తన్న చిరుత..? ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

  కొత్త కేబినేట్లో కొన‌సాగించిన పాత మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు త‌మ‌కు కేటాయించిన శాఖ‌ల ప‌ట్ల చాలా అసంతృప్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం అందులో  ముఖ్యంగా  బొత్స ముందున్నారు అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు   జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఏర్ప‌డిన‌ప్పుడు మంత్రిగా బాధ్య‌త‌లు ఇస్తూనే రాజ‌ధాని అంశంతో ముడిప‌డిన శాఖ పుర‌పాల‌క శాఖ‌ను బొత్స‌కు కేటాయించారు   ఆ శాఖ‌ను ఆదిమల‌పు సురేష్ కు కేటాయించ‌డంపై బొత్స కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్లు సమాచారం..

  ఇదీ చదవండి: థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. రాజీనామా అన్నారు.. మాజీ హోం మంత్రి క్లారిటీ

  ఎంతో ప్రాదాన్యం ఉన్న శాఖ‌ను త‌న ద‌గ్గ‌ర నుంచి తిసేసి వేరే వాళ్ల‌కు కేటాయించ‌డం బొత్స జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.  బొత్స తో పాటు ఇదే కోవలో పెద్ది రెడ్డి కూడా త‌న‌కు కేటాయించిన శాఖ ప‌ట్ల చాలా సంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాము చేసిన  ఒత్తిడి త‌ట్టుకోలేక మంత్రి ప‌ద‌వులు కోన‌సాగించ‌నా క‌నీసం సీనియార్టీ కూడా ప‌క్క‌న పెట్టి ఎటువంటి ప్రాదాన్య‌త లేని శాఖ‌లు కేటాయించ‌డం ప‌ట్ల ప‌లువురు మంత్రులు పెద‌వి విరుస్తోన్న‌ట్లు స‌మాచారం.

  ఇదీ చదవండి: ఏపీలో మరో బాదుడు.. ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం.. కొత్త ఛార్జీలు ఇలా

  మంత్రి ప‌ద‌విపై గంపెడు ఆశ‌లు పెట్టుకున్న రోజాకు మంత్రి ప‌ద‌వి జ‌గ‌న్ ఇచ్చిన‌ప్ప‌టికి త‌న‌కి కూడా ఎటువంటి ప్రాదాన్య‌త లేని శాఖ కేటాయించ‌డం ప‌ట్ల త‌ను కూడా కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ప‌క్కా అని పిక్స్ అప్పుడు నిరాశే మిగుల్చుకున్న రోజాకు ఇప్పుడు మంత్రి ప‌ద‌వి వ‌రించినా తాను ఎప్ప‌టినుంచో అనుకున్న హోం శాఖ త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల కాస్త నొచ్చుకున్న‌ట్లు తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు