హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. మంత్రి కీలక ప్రకటన

AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. మంత్రి కీలక ప్రకటన

మంత్రి మేరుగ నాగార్జున

మంత్రి మేరుగ నాగార్జున

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాటు చేసినవే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలు. ఐతే పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాటు చేసినవే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలు. ఐతే పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరించడానికి, అలాగే మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకోవాలని బీవోజీ సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున  (Minister Meruga Nagarjuna) తెలిపారు.

  ఎస్సీ గురుకులానికి చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) 70 వ సమావేశంలో కీలక నిర్ణాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించడానికి, విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలను, నాణ్యమైన విద్యను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించినట్లు మంత్రి తెలిపారు. దీనిలో భాగంగానే ఎస్సీ విద్యార్థులకు వృత్తి విద్యలలో కూడా శిక్షణలు ఇవ్వాలని నిర్ణయించామని, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం కోర్సులలో శిక్షణలు ఇవ్వడానికి చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.

  ఇది చదవండి: ఇకపై వార్ వన్ సైడే.. గ్రూపులు కడితే గెట్ ఔట్.. చంద్రబాబు కామెంట్స్


  విద్యార్థులను క్రీడల్లో కూడా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఏలూరు జిల్లాకు చెందిన కొలసానిపల్లి, పెదవేగి లలో స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాగార్జున తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు ఐఐటీ, నీట్ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా ఉమ్మడి జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 11 శిక్షణా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగిందని నాగార్జున వివరించారు.

  ఇది చదవండి: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..


  అలాగే ఖాళీగా ఉన్న 90 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి, అవసరమైన చోట కొత్తగా నర్సింగ్ పోస్టులను మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. తుప్పు పట్టిన ఐరన్ పైపుల స్థానంలో పీవీసీ పైపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలని, తాగునీటి కొరత ఉన్న గురుకులాల్లో సమస్య తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

  ఇది చదవండి: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?


  179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది సీబీఎస్ఇ విద్యావిధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే గురుకులాలకు చెందిన టీజీటీ టీచర్లకు సీబీఎస్ఇ కి చెందిన ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లలో శిక్షణలు కూడా ఇవ్వనున్నామని చెప్పారు. పెద్దగా డిమాండ్ లేని కోర్సుల స్థానంలో డిమాండ్ కలిగిన కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

  ఇది చదవండి: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!


  కాగా ఎస్సీ గురుకులాలలో విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి వినూత్నంగా రూ.65.06 కోట్ల వ్యయంతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా 1233 కే.వి.ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. గురుకులాలలో విద్యార్థుల రక్షణ, పటిష్టమైన పర్యవేక్షణ కోసం రూ.7 కోట్లతో సీసీ కెమెరాలను ఐటీ విభాగం ద్వారా ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, EDUCATION

  ఉత్తమ కథలు