AP POLITICS SMALL BREAK FOR ANDHRA PRADEHS NEW DISTRICT ISSUE IN BALAJI DISTRICT WHAT HAPPENED NGS TPT
Sri Balaji District: కసరత్తు పూర్తి కాకముందే ఆ జిల్లాకు బ్రేకులు.. కారణం అదే..?
ప్రతీకాత్మకచిత్రం
AP New District: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఊహించని విధంగా ఓ జిల్లా ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.. అందుకు కారణం ఏంటో తెలుసా..?
AP New Distric: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాలు, భౌగోళిక స్వరూపం ప్రాతిపదికన 26 జిల్లాలుగా విభజించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు కొత్త జిల్లాలపై ప్రజల నుంచి 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా జిల్లా పరిధులు, పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల లాంటి డిమాండ్లే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి (East Godavari ), గుంటూరు (Gunturu), కృష్ణా (Krishna) జిల్లాలకు సంబంధించి ఎక్కువ డిమాండ్లు వచ్చాయి. శ్రీకాకుళం (Srikakulam) నుంచి చిత్తూరు (Chittoor) వరకు ప్రతి జిల్లాలోనూ కొత్త విజ్ఞప్తులు తెరపైకి వచ్చాయి. ఈ అభ్యంతరాల పరిశీలన కూడా పూర్తైనట్టు సమాచారం. దీంతో తుది నోటిఫికేషన్ కు ఏపీ ప్రభుత్వం (AP Government) సిద్ధమవుతుంటే.. ఓ కొత్త జిల్లా ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయి.
ప్రభుత్వం ఓ వైపు వేగంగా అడుగులు వేస్తుంటే.. ఇటు తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న బాలాజీ జిల్లాకు (Sri Balaji District) తాత్కాలికంగా బ్రేకుల పడ్డాయి. ఈ కొత్త జిల్లాలకు కలెక్టరేట్‌గా పద్మావతి నిలయం సిద్ధం అవుతుండగా.. హైకోర్టు ఇచ్చిన స్టేతో జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పద్మావతి నిలయాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు కేటాయించండపై హైకోర్టు స్టే విధించింది. ఎందుకంటే పూర్తిగా భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించడంపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తాజా అభ్యంతరాలపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం పద్మావతి ఆలయం ముస్తాబవుతోంది. తాత్కాలిక కలెక్టరేట్‌తోపాటు రెండు ప్రభుత్వ శాఖల కోసం అందులో గదులను కూడా కేటాయించింది టీటీడీ. అందుకనుగుణంగా ఫర్నీచర్, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కూడా కేటాయించింది ప్రభుత్వం. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడంపై ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపారు బీజేపీ నేతలు. అయినా ప్రభుత్వం ముందుకు పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాలపై ఇటు టీటీడీ, అటు ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తాయో చూడాలి.. వారి వివరణ ఆధారంగానే కలెక్టర్ విషయంలో ముందుకు వెళ్లాలా లేదా అన్నది తెలుస్తోంది. అప్పటికే హైకోర్టు కుదరదని తేల్చి చెబితే.. ఏపీ ప్రభుత్వం మళ్లీ ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు జిల్లా ఏర్పాటు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.