అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన ఎస్సై (Sub Inspector of Police) తన కర్తవ్యాన్ని మరిచాడు. డ్యూటీలో భాగంగా బందోబస్తుకు వచ్చి రెచ్చిపోయాడు. అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సింది పోయి తానూ స్టేజ్ ఎక్కాడు. చుట్టూ ఉన్న వాళ్ల చప్పట్లు, కేరింతలు, పక్కనే అమ్మాయిలు ఉండడంతో ఎస్సై (Sub Inspector of Police) తన టాలెంట్ ను ప్రదర్శించాడు. అమ్మాయిలతో కలిసి మెగాస్టార్ పాట అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు రెచ్చిపోయాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై (Sub Inspector of Police) హరికృష్ణ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బర్త్ వేడుకలకు బందోబస్తుకు వెళ్లిన ఎస్సై తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అశ్లీల నృత్యాల ఏర్పాటుపై మందలించాల్సింది పోయి రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయ్యాయి. దీనిపై దృష్టి సారించిన పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సై (Sub Inspector of Police) హరికృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అతనిని VRకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్బంగా రోటరీ ప్రాంతంలో ఫ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం టెక్కలి పోలీస్ స్టేషన్ కు కొద్దీ దూరంలోనే ఉంది. ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకు కొంతమంది యువతులు వచ్చారు. ప్రోగ్రాంలో భాగంగా వారు డ్యాన్స్ చేస్తుండగా టెక్కలి ఎస్సై (Sub Inspector of Police) హరికృష్ణ తనలో ఉన్న టాలెంట్ ను చూయించాలనుకున్నాడేమో ఏకంగా స్టేజ్ పైకి ఎక్కి యువతులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ పాట అబ్బని తియ్యని దెబ్బ పాటకు స్టెప్పులేశాడు.
దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయ్యాయి. అయితే యువతుల అశ్లీల డ్యాన్స్ ఆపాల్సింది పోయి తను కూడా డ్యాన్స్ వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువత్తాయి. ఈ క్రమంలో దృష్టి సారించిన పోలీసులు ఎస్సై (Sub Inspector of Police) హరికృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని వీఆర్ కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Social Media