హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: కోటంరెడ్డికి వైసీపీ చెక్..ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలు?

Ap: కోటంరెడ్డికి వైసీపీ చెక్..ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలు?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి రేపుతున్నాయి. ఓ వైపు కోటంరెడ్డి, మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ కూడా పార్టీ నాయకత్వం, పని తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఒకరి తరువాత మరొకరు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్దరి నాయకుల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం నెల్లూరు జిల్లా నాయకులతో సీఎం జగన్ రివ్యూ మీటింగ్ పెట్టనున్నారు. ఈ మీటింగ్ లో సీఎం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి రేపుతున్నాయి. ఓ వైపు కోటంరెడ్డి, మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ కూడా పార్టీ నాయకత్వం, పని తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఒకరి తరువాత మరొకరు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్దరి నాయకుల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం నెల్లూరు జిల్లా నాయకులతో సీఎం జగన్ రివ్యూ మీటింగ్ పెట్టనున్నారు. ఈ మీటింగ్ లో సీఎం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Tirumala Temple: తిరుమలలో మరోసారి అపచారం.. భద్రతా వైఫల్యంపై విమర్శలు..!

కోటంరెడ్డికి చెక్..ఇంఛార్జ్ బాధ్యతలు ఆదాల చేతికి?

నా ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే వైసీపీపై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆయనకు  సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో 'నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తాను. ఇక తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని..వాటిని బయటపెడితే ఐపీఎస్ ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయి. దీనిపై కేంద్రం నుంచి  జరుగుతుందని' ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో కోమటిరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు రూరల్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం జరగబోయే మీటింగ్ అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

ఆదాలకే ఎందుకు?

ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్నాడు. దీనితో కోటంరెడ్డిని ఎదుర్కొనే వ్యక్తి ఆదాల అని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రేసులో అనిల్, ఆనం, విజయ్ కుమార్ ఉండగా..ఆదాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది.

Andhra Pradesh: YS వివేకా హత్య కేసులో ట్విస్ట్ .. ఎంపీ కాల్‌ డేటాలో తెరపైకి నవీన్ అనే మరో వ్యక్తి పేరు

ఇక ఆనం రామనారాయణ కూడా ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. 'నాకు ప్రాణహాని ఉంది. నా సెక్యూరిటీ తగ్గించారు. 2 ఏళ్ల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నా రెండు ఫోన్లు ట్యాప్ చేశారు. నా PA ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను యాప్ లతో ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది. ఈ వేధింపులు..సాధింపులు కొత్తేమి కాదు. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. హత్యా రాజకీయాలు చేయలేదు. నేను సీబీఐ కేసుల్లో హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదని' ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

కాగా గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆనంపై సర్కార్ చర్యలు తీసుకుంది. ఆనంను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించగా..ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా పాల్గొనోద్దని స్పష్టం చేసింది. అయితే వీరు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Kotamreddy sridhar reddy, Ycp

ఉత్తమ కథలు