జిల్లా పేరు మార్పు రగడతో కోనసీమ అట్టుడుకుతోంది. ప్రశాంతంగా ఉంటే కోనసీమ (Konaseema) జిల్లా కేంద్రం అమలాపురం (Amalapuram) లో అల్లర్లు, హింస చెలరేగడం సంచలనంగా మారింది. ఇది ప్రభుత్వ వైఫల్యమైనని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వానికి మచ్చతెచ్చేందుకే ప్రతిపక్ష పార్టీలు కుట్రచేశాయని అధికార వైసీపీ (YSRCP) కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు (Chandrababu(, పవన్ పక్కా ప్లాన్ తో అల్లర్లు సృష్టించారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకొని తిరుతామని స్పష్టం చేశారు. ఐతే మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లలో అన్యం సాయి అనే వ్యక్తి కీలకపాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అతడు జనసేనకు చెందిన వ్యక్తని వైసీపీ ఆరోపిస్తుంటే.. వైసీపీ సానుభూతిపరుడని జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అమలాపురంలోని కలెక్టర్ ఎదుట అన్యం సాయి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అతడు జనసేనకు చెందినవాడంటూ కొన్ని ఫోటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఐతే అన్యం సాయి అనే వ్యక్తి అమలాపురంకు చెందిన వైసీపీ నేత ఒంటెద్దు వెంకటనాయుడికి అనుచరుడిగా తెలుస్తోంది. గతంలో వైసీపీకి చెందిన కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ బర్త్ డే వేడుకలు, పార్టీ తరపున నిర్వహించిన ఇతర కార్యక్రమాల్లో ఉన్నాడు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో ఉన్న పోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే మంత్రి విశ్వరూప్ కు అనుకూలంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్లు ఫోటోలు చూపిస్తున్నారు.
Here's the proof .....
Behind ...#KonaseemaDistrict
Issue#YsJaganFailedCM pic.twitter.com/2ykPOrugOr
— 🕉️నేనొకరకం🕉️ (@hmkjayaram) May 24, 2022
జనసేనపై బురద జల్లేందుకు అధికార వైసీపీనే ఇలా చేస్తోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అమలాపురం అల్లర్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్య వార్ జరుగుతోంది. అసలు దీనంతటికీ కారణం అన్యం సాయియేనా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది.
Wt about this pic.twitter.com/7YVAe3gIQW
— spider man (@CharanNalli) May 25, 2022
ఇప్పటికే అల్లర్లకు సంబంధించిన వీడియోలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అందులో ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నవారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీని వెనుకున్నది ఎవరనే విషయాలను బయటపెట్టే అవకాశముంది. తొలుత కలెక్టర్ కు వినతిపత్రం ఇస్తామని చెప్పి వెళ్లినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. అదే సమయంలో వెనుకనుంచి ఒక్కసారిగా కొంతమంది దూసుకొచ్చారని.., నిరసనకారుల్లో కొంతమంది విధ్వంసాన్ని సృష్టించార తెలిపారు. ఇప్పటివరకు 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.