RGV Vyuham Movie Story: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చేసినా సంచలనమే.. ఇటీవల కేవలం వివాదాల్లోనే నిలుస్తూ.. హిట్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరో సంచలనానికి వేదికగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను మలుపుతిప్పే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ని కలిసి వచ్చిన ఆయన.. త్వరలో తాను వ్యూహం అనే పొలిటికల్ మూవీ తీయబోతున్నట్లు ట్వీట్ చేశారు. అది బయోపిక్ కాదని.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయన్నారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించినదే ఈ వ్యూహం అంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరో ట్వీట్ తో సినిమాలో కథ ఇదే అంటూ హింటు ఇచ్చారు.
తాజాగా మరో ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా స్టోరీ ఇదే అంటూ హింటు ఇచ్చారు. బీజేపీ డివైడెడ్ బై పవన్ కళ్యాణ్ ఇంటు సీబీఎన్ మైనస్ లోకేష్ ప్లస్ జగన్.. ఇదే వ్యూహం అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది క్లారిటీ వచ్చినట్టే..
BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం
— Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2022
ఇది ఇది కేవలం ఒక్క సినిమా మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి పార్ట్ “వ్యూహం”, రెండో భాగం “శపథం”. ఈ రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయన్నారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం” షాక్ నుంచి తేరుకునే లోపే వాళ్లకు ఇంకో ఎలక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం” లో తగులుతుంది… అంటూ గురువారమే క్లారిటీ ఇచ్చారు.
ఇక తాజాగా ఆయన ట్వీట్ ప్రకారం చూస్తుంటే.. తొలి పార్ట్ లో.. జగన్ మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన్ను దించేయడానికి ఓ కీలక నేత ఎలాంటి వ్యూహాలు రచించారు. అన్ది ఆయన్ను అడ్డుకోవడానికి ఎలాంటి కుట్రలు జరిగాయి అన్నవి తొలి సినిమాలో వివరిస్తారు. బీజేపీ ని పవన్ కళ్యాణ్ తో వాడుకుని.. చంద్రబాబు తన బలం పెంచుకోవాలని చూస్తే.. నారా లోకేష్ తీరు మైనస్ అయ్యిందని.. అవన్నీ కలిసి జగన్ కు ప్లస్ అయ్యాయి అంటూ.. ప్రత్యర్థి పార్టీల కుట్రపూరిత వ్యూహాలపై ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. బ్రేక్ దర్శనాల విషయంలో కీలక నిర్ణయం..
ఇదిలా ఉంటే ఇది ఖచ్చితంగా జగన్‌ను హీరోని చేస్తూ.. పవన్ కల్యాణ్, చంద్రబాబుని విలన్లుగా చూపిస్తూ ఉంటుందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇది బయోపిక్ కాదని.. రియల్ పిక్ అని ట్వీట్ చేసిన వర్మ.. ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్ గురించే అనే చర్చ జరుగుతోంది. తనకు నచ్చినది నచ్చినట్లు తీయడం వర్మ నైజం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ram Gopal Varma, RGV