జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ (YS Jagan) ప్రభుత్వం ప్రతి పౌరుడిపై సగటున రూ.5.50 లక్షల అప్పు భారం మోపిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లకు దాటిపోతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం లేదా ఆర్బీఐ ఈ అంశంపై ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా చేసే అప్పులపై మూడేళ్ల కాగ్ (CAG) రిపోర్టులు తీసుకొని విశ్లేషణ చేయడం జరిగిందని యనమల జగన్ పాలన ముగిసేసరికి ఓపెన్ మార్కెట్ అప్పులు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని అన్నారు. అన్ని రకాల అప్పులు కలిపి కలిపి రూ.12.50 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్చి 2024 నాటికి ఔట్ స్టాండింగ్ అప్పులు పెరగనున్నాయని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఆర్బీఐ ఇంకా అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రోజువారి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగి రూ.15,000 కోట్ల భారం ప్రజలపై పడనుందని యనమల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఏటా రూ. 54,000 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతోందని.. వైసీపీ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయే నాటికి సరాసరి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద రూ.2,70,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని తెలిపింది.
ప్రభుత్వం సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని గొప్పలు చెబుతున్నప్పటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందడం లేదని కాగ్ రిపోర్టు లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయని యనమల విమర్శించారు. 2019-20 వ ఆర్థిక సంవత్సరానికి రూ.48 వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన 1 లక్ష కోట్లకు లెక్కలు బయటకు చూపించలేదు.
Breaking News: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ స్విచ్ ఆఫ్.. ఈసీ వేటు వేస్తుందా..?
Tirumala: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ నుంచి మళ్లీ ఆ టికెట్లు..
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,18,000 కోట్లకు లెక్కలు బహిర్గతం చేయలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారులకు లక్షల్లో జీతాలు ఖర్చు చేస్తున్నారని యనమల ఆరోపించారు. రాజకీయ సలహాదారులకు ప్రజల డబ్బును జీతాలుగా చెల్లించే అర్హత లేదని అన్నారు. అధిక సంఖ్యలో తన పార్టీ అవసరాల కోసం జగన్ సలహాదారులను నియమించుకుని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ధనంతో వాలంటీర్లను ప్రభుత్వం ఏ విధంగా నియమించిందని ఆయన ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.