AP POLITICS SENIOR IPS AB VENKATESWARA RAO FINALLY GOT PLACEMENT DO YOU KNOW WHICH DEPARTMENT NGS GNT
AB Venkateswararao: ఫలించిన ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం.. ఎట్టకేలకు పోస్టింగ్.. ఏ పదవి ఇచ్చారంటే..?
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు
AB Venkateswararao: ఎట్టకేలకు సీనీయర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం లభించింది. లాంగ్ బ్రేక్ తరువాత.. మళ్లీ ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏంటో తెలుసా..?
AB Venkateswara Rao Post: సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IAS Officer) ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswararao) న్యాయ పోరాటంలో నెగ్గారు. సుదీర్ఘ విరామం తరువాత ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది. నేటి వరకు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. తాజాగా మనసు మార్చుకుంది. ఆయనకు పోస్టింగ్ ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. టీడీపీ (TDP) హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసులతో ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా అతని పోస్టింగ్ ను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో గూఢచర్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ కోసం పోరాటం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసిన జగన్ సర్కార్.. సర్వీస్ ను మాత్రం ఇంతకాలం పెండింగ్ లో పెట్టింది. ఆయన పలుమార్లు సచిలవాయం చుట్టూ.. సీఎస్ చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. దీంతో మరోసారి ఆయన న్యాయపోరాటానికి సిద్దం అవుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయనకు పోస్టింగ్ కూడా ఇస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయటంతో 2022 మే 19 తేదీన సాధారణ పరిపాలన శాఖకు ఆయన రిపోర్టు చేశారు. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏబీ వెంకటేశ్వరావుకు పోస్టింగ్ ఇవ్వడంతో ఇప్పటివరకూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి .విజయ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చింది.
మరోవైపు తనకు ఎప్పటి నుంచి సస్పెండ్ చేశారో అప్పటి నుంచే ఎత్తేస్తూ ఆదేశాలు ఇవ్వాలని, అప్పటి నుంచి జీతభత్యాల బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. అలాగే కొత్తగా పోస్టింగ్ కూడా ఇవ్వాలని కోరారు. కానీ ప్రభుత్వం ఇవాళ్టి వరకూ ఆయన విజ్ఢప్తిపై మౌనంగా ఉంటూ వచ్చింది. కానీ మళ్లీ ఆయన న్యాయస్థానానికి ఆశ్రయిస్తే సాంకేతికంగా ఇబ్బందులు తప్పవు.. దీంతో ఎట్టకేలకు ఇవాళ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.