AP POLITICS SENIOR HEROIN JAYAPRADA FOCUSED ON ANDHRA PRADESH SHE WANT TO CONTESTANT FROM GODAVARI DISTRICTS NGS
Glamour Politics: అలనాటి అందాలతార ఫోకస్ ఏపీపైనే.. గోదావరి జిల్లాల్లో కర్చీఫ్ వేస్తున్నారా?
జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం (File/Photo)
Glamour Politics: ఒకప్పుడు తెలుగు తెరపై వెలుగు వెలిగి.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన.. అలనాటి అందాల తార.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. అది కూడా ఈ సారి ఆమె మనసు ఏపీపై పడినట్టు తెలుస్తోంది. అందులోనూ గోదావరి జిల్లాల్లో ఆమె కర్చీఫ్ వేశారనే ప్రచారం కూడా ఉంది.
Glamour Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి (Andhra Pradesh Politics) రీ ఎంట్రీ ఇవ్వాలని అలనాటి అందాల నటి జయప్రద (Jayaprada) ఇప్పటికే డిసైడ్ అయ్యారు. టాలీవుడ్ (Tollywood) తోపాటు బాలీవుడ్ (Bollywood) లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. రాజకీయ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాక.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కానీ ఆమె తరువాత ఫేడ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుని.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె తన మనసులో మాట బటయపెట్టారు కూడా.. ఇకపై తెలుగు రాజకీయాలపై ఫోకస్ చేస్తానని చెప్పారు. అయితే తెలంగాణ కంటే.. ఆంధ్రప్రదేశ్ లోనే తనకు రాజకీయంగా ప్లస్ అవుతుంది ఆమె అంచనా వేసుకుంటున్నారు. అందులోనూ గోదావరి జిల్లా (Godavari District) లు అయితే బెటరనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల రాజమండ్రి (Rajhmundry) లో బీజేపీ (BJP) నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు షాడే గాళ్స్ స్కూలు, ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. సినిమాల్లోకి వెళ్లిన తర్వాత టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు జయప్రద. అయితే రాజకీయాలకు కూడా ఆమె కొత్త కాదు. నటిగా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే 1994లో టీడీపీలో చేరారు. రాజ్యసభ సభ్యురాలిగా పదవి చేపట్టారు. అయితే టీడీపీతో విభేదాలు రావడంతో సమాజ్‌వాదీపార్టీలో చేరారు జయప్రద.
అయితే జాతీయ రాజకీయాల్లో ఆరంభంలోనే ఓ వెలుగు వెలిగారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి రెండుసార్లు యూపీలోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచారామె. అక్కడ కూడా ఎంతో కాలం ఉండలేదు. 2011లో అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌మంచ్ ఏర్పాటు చేశారు. 2014లో RLDలో చేరి.. బిజ్నోర్ నుంచి పోటీ చేసినా కలిసి రాలేదు. చివరకు 2019లో కాషాయ కండువా కప్పుకొని బీజేపీ నేతగా మారారు జయప్రద. ఆ క్రమంలోనే రాజమండ్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ఆమె రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. చర్చగా మారింది.
అయితే ఆమె నటిగా.. రాజకీయ నేతగా ఉన్న సమయంలోనూ ఆమె.. జన్మభూమి రాజమండ్రిని మర్చిపోలేదు. ఐదేళ్లకు ఒకసారైనా ఇక్కడి వచ్చి వెళ్తుంటారు. బంధువులు, స్నేహితులను కలిసి పాత సంగతులు గుర్తు చేసుకుంటారు జయప్రద. యూపీ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు రాజమండ్రిలో తాను చదువుకొన్న విద్యాసంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం చేసేవారు. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్ రోల్ పోషించాలని చూస్తున్న ఆమె.. ఆంధ్రా ప్రదేశ్ లో కీలకపాత్ర వహిస్తానని మనసులో మాట అధిష్టానినిక చెప్పారని టాక్. కేవలం ప్రచార కార్యక్రమాలకే మిగిలిపోకుండా.. వచ్చే ఎన్నికల్లో జయప్రద రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చని కాషాయ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
గతంలో రాజమండ్రి నుంచి గిరజాల వెంకటస్వామి నాయుడు, సత్యనారాయణరావులు బీజేపీ ఎంపీలుగా గెలిచారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో సత్యనారాయణరావు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు జయప్రద పోటీ చేస్తే అది రాజమండ్రితోపాటు.. చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ బీజేపీకి అనుకూలంగా మారుతుందని అభిప్రాయ పడుతున్నారట.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.