Home /News /andhra-pradesh /

AP POLITICS SENIOR ACTOR MANCHU MOHAN BABU WHY TAKING U TURN HE SAID NOW IN BJP NGS TPT

Mohan Babu: అధికార వైసీపీతో చెడిందా..? సీఎం జగన్ కు మోహన్ బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారా?

మోహన్ బాబు యూటర్న్

మోహన్ బాబు యూటర్న్

Mohan Babu: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి చాలా వర్గాలు దూరమవుతున్నాయి. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన చాలామంది ఒక్కొక్కరిగా.. యూటర్న్ తీసుకుంటున్నారు.. ఇక సినిమా ఇండస్ట్రీతో వైసీపీ ఇంకాస్త గ్యాప్ ఉంది. ఇప్పటికే థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ వ్యతిరేక గళం వినిపిస్తున్నాడు. తాజాగా మోహన్ బాబు సైతం స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం ఉంది.

ఇంకా చదవండి ...
  Mohan Babu: సీనియర్ హీరో.. విలక్షణ నటుడు మోహన్ బాబు (Mohan Babu).. రూటు మార్చారా..? తాజాగా తిరుపతి (Tirupati)లో మోహన్ బాబు వ్యాఖ్యలు చూసిన తరువాత.. రాజకీయంగా అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన వ్యవహారం చూస్తే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కొడుకులతో కలిసి కొంత దూరం పాదయాత్ర కూడా చేశారు. అయితే అలా పాద యాత్రగా వెళ్లడం పొలిటికల్ స్టంటే అనే విమర్శలు ఎదురయ్యాయి. రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది. అయితే మోహన్ బాబు మాత్రం.. తనకు పాదయాత్రతో వచ్చే పబ్లిసిటీ అవసరం లేదన్నారు. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.. అంతేకాదు చంద్రబాబు (Chandababu)పై ఘాటు విమర్శలు చేశారు. పార్టీ అధినేతను ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. మొత్తానికైతే గత ఎన్నికల ద్వారా రాజకీయంగా ఆయన అనుకున్నది సాధించారు. కానీ తరువాత అనుకున్నత సాఫీగా వ్యవహారం కనిపించలేదు.

  వైసీపీ తనను పట్టించుకోవడం లేదనే నిరాశలో ఉన్నారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చినా.. అధికారపార్టీతో టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. కానీ మొన్నటి మా ఎన్నికల్లో మంచు విష్ణుకు వైసీపీ తెర వెనక మద్దతుగా ఉందని ప్రచారం జరిగింది. దాంతో మంచు ఫ్యామిలీకి.. వైసీపీకి గ్యాప్‌ రాలేదని చర్చ సాగింది. అయితే తాజగా తిరుపతిలో మోహన్‌బాబు చేసిన కామెంట్స్‌ మాత్రం మరో అర్థం వచ్చేలా ఉన్నాయి.  తనతో పాటు ఉన్న అధ్యాపకులతో ముచ్చటించిన మోహన్ బాబు.. తాను ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నానని చెప్పినట్టు సమాచారం. అందుకే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని చెప్పుకొచ్చారు. ఆ కామెంట్స్‌ చుట్టూనే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో కుటుంబసభ్యులతో వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు మోహన్‌బాబు. అప్పుడే బీజేపీలో చేరిపోతారని అనుకున్నారు. కానీ.. ఆయన కండువా మార్చింది లేదు. ఆ తర్వాత పలు సందర్భాల్లో మోదీకి మద్దతుగా మాట్లాడారు కూడా. కానీ ఇంతకాలం పరోక్ష సంకేతాలే ఇచ్చారు. తాజాగా తిరుపతిలో మాత్రం ఆ డోస్‌ పెంచినట్టే కనిపిస్తోంది. పైగా మోహన్‌బాబు తిరుపతి పర్యటనలో ఆయన వెంట బీజేపీ నేత కోలా మోహన్‌ కనిపించారు.

  ఇదీ చదవండి : సింహంతో వేట.. జగనన్నతో ఆట వద్దు.. రోజా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. పవన్, చంద్రబాబుకు వార్నింగ్

  అయితే వైసీపీతో మోహన్ బాబుకు ఎందుకు చెడింది అన ప్రశ్న ఇప్పుడు పుట్టుకొస్తోంది. దానికి కారణం ఇదే అంటున్నారు ఆయన అభిమానులు. అది ఏంటంటే? వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ ఛైర్మన్‌ లేదా.. రాజ్యసభ సీటు ఇస్తారని మోహన్‌బాబు ఆశించారని ప్రచారం జరిగింది. చివరకు ఫిలిం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన పదవి విషయంలోనూ ఆయన పేరు చర్చల్లో నలిగింది. ఆయన పేరు అయితే ప్రతిసారి ప్రస్తావనకు వచ్చేది.. కానీ.. ఏ పదవీ దక్కలేదు. పైగా ఎప్పటి నుంచో పోరాడుతున్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదట. ఆ బకాయిల కోసం గతంలో రోడ్డుపై ధర్నా చేస్తేనే కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగానే కోర్టు వాయిదాకు వచ్చారు మోహన్‌బాబు. ఆయన వాయిదాకు వస్తారని తెలిసినా.. పాదయాత్ర చేయడం.. బీజేపీకి అనుకూలంగా కామెంట్స్‌ పాస్‌ చేయడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని అనుమానిస్తున్నారట. మనసులో ఏదో పెట్టుకుని.. ఒకరికి పరోక్షంగా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని చర్చ జరుగుతోంది. మరి ఆయన పాదయాత్ర.. కామెంట్స్‌ ద్వారా ఏంటి ఆశిస్తున్నారు అన్నది త్వరలో తేలనుంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Manchu mohan babu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు