హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్.. రాకుంటే రాజకీయ సన్యాసమే..

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్.. రాకుంటే రాజకీయ సన్యాసమే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీలో ఆ ఎమ్మెల్యేకు ఈ సారి మంత్రి పదవి ఖాయమైందా..? మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆ డిప్యూటీ సీఎం పరిస్థితి ఏంటి.. ఆమెను తప్పించి ఎమ్మెల్యేను ప్రమోట్ చేస్తారా..? ఒక వేళ ఈ సారి తనకు మంత్రి పదవి రాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ఇప్పటికే సన్నిహితులకు చెప్పారంట..? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..

ఇంకా చదవండి ...

  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18          ఏపీ కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.  తొలి కేబినెట్ ప్రకటించిన సమయంలోనే సీఎం జగన్ దీనిపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత పని తీరు బట్టి మార్పులు ఉంటాయని స్పష్టంగా చెప్పేశారు. రాజకీయంగా జగన్ ఒక మాట చెబితే అది తూచా తప్పక పాటిస్తారని వైసీపీ నేతలు  నమ్ముతున్నారు. ఇప్పుడు ఏపీ కేబినెట్ కొలువు తీరి రెండున్నరేళ్లు కావోస్తోంది. అందుకే త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని సీనియర్ నేతలంతా ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే మంత్రి పదవి హామీ ఉన్నా.. అప్పటి రాజకీయ పరిస్థితులు.. సామాజిక సమీకరణల కారణంగా పదవి కోల్పోయిన వారంతా ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారు. జగన్ సన్నిహితుల దగ్గర తమ మనసులో మాట బయట పెడుతున్నారు.  ఆ జాబితాలోనే ఉన్నారు  విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర..  ఈ సారి తప్పక తనకు మంత్రి పదవి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి దీనిపై హామీ వచ్చిందని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు..

  ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గమైన సాలూరులో గత నాలుగుసార్లుగా గెలుస్తూ వస్తున్న రాజన్నదొరకు 2019లోనే మంత్రి పదవి వస్తుందని భావించినా.. అప్పటి రాజకీయ కారణాలు.. ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కష్టపడిన తీరు అన్నింటినీ లెక్కలు వేసుకున్న సీఎం జగన్ ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోలేదు. అదే సామాజిక వర్గానికి చెందిన జూనియర్ కు మంత్రి పదవి ఇచ్చారు.

  సాలూరు గిరిజన నియోజకవర్గంలోని రాజన్నదొర మక్కువ మండలానికి చెందిన వ్యక్తి. జీసీసీలో మేనేజర్‌గా పనిచేశారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పిలుపుతో ఆయ‌న బ్యాంక్ చైర్మన్ పదవిని ప‌క్కన పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ త‌ర‌పున 2004లో పోటీ చేసి ఓడిపోయినా.. రాజన్నదొరపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ పై కోర్టు తీర్పుతో వేటు పడడంతో.. రెండేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎమ్మెల్యే అయిపోయారు. అక్కడి నుండి వరుసగా 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలిచి తిరుగులేని నేతగా ఎదిగారు.  విద్యావంతుడు కావడం, ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ గా చేయడం, సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అంత బలంగా లేకపోవడం, ఎమ్మెల్యేగా చేసిన అభివ్ళద్ది కార్యక్రమాలు రాజన్నదొరను వరుసగా గెలిచేందుకు తోడ్పడుతున్నాయి.

  నాలుగుసార్లు గెలవడానికి తోడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కావ‌డంతో ఆయ‌న మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లోనే ఆయ‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నారు.  కానీ ఆయన కన్నా చాలా జూనియ‌ర్ అయిన‌ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.  తర్వాత ప్రభుత్వం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి.. కేబినెట్ లో చోటు దక్కని వారికి ప్రాంతీయ మండళ్ల చైర్మన్లుగా అవకాశం కల్పించి కేబినెట్ ర్యాంకు హోదా పదవులు ఇవ్వాలని భావించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విజయనగరం కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివ్ళద్ది మండలికి విజయనగరం నుండి రాజన్నదొరకు అవకాశం ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కూడా దక్కలేదు. తరువాత ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపి.. మరో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అప్పడు కూడా రాజన్నదొరకు ఛాన్స్ ఇవ్వలేదు.  ఈ సారి జరిగే విస్తరణలో తప్పక చోటు దక్కుతుందని భావిస్తున్నారు.


  ఇక రాజన్నదొరకు ముఖ్యమంత్రి జగన్ వద్ద మంచి మార్కులే ఉన్నా.. ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. అధికారులను నిలదీయడం, అసమ్మతి తెలియజేయడం వంటి కారణాలు కూడా మంత్రి పదవి రాకపోవడానికి కారణంగా పార్టీ నేతలు చెబుతున్నారు. 2018లో సాలూరు మండలం ఖరాసవలసలో జ్వరాల బారిన పడి అనేక మంది మృతి చెందితే ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ పదవి వద్దు అంటూ ఆయన తన ఎమ్మెల్యే గిరినే వదులుకోవడానికి సిద్ధపడ్డారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ దిగివచ్చి.. ఆ గ్రామానికి వైద్యుల బృందాన్ని పంపి మరణాలను అదుపులోకి తెచ్చింది.

  అయితే, ఇటీవ‌ల కాలంలో డిప్యూటీ సీఎం, జిల్లా మంత్రి పుష్పశ్రీవాణి పనితీరుపై కొంత అసంతృప్తి ఉంది. దీంతో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్యస్థీక‌ర‌ణ ఉంటుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఈసారైనా రాజన్నదొరకు అవ‌కాశం ద‌క్కుతుందా? అని అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు.  సీనియారిటీ, సామాజిక వర్గం, వరుస విజయాలు ఆయనకు అనుకూలించనున్నాయి.  పాదయాత్రలో భాగంగా సాలూరు వచ్చినప్పుడు రాజన్నదొరను ముఖ్యమంత్రి జగన్ కొనియాడిన తీరు.. ఇప్పటికీ నియోజకవర్గ ప్రజల చెవుల్లో మారుమోగుతునే ఉంది. andhra pradesh, ap news, ap politics,ap cabinet, ap cabinet expansion, depury minster pamula puspa srivani out?, saluru mla rajanna dhora will get chance, what about minster bothsa, is there any chance to kolagata veerabadhra swamy, vizianagaram news, vizinagaram political news, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ తాజా వార్తలు, ఏపీ లేటెస్ట్ న్యూస్, విజయనగరం వార్తలు, విజయనగరం పొలిటికల్ వార్తలు, ఏపీ కేబినెట్ విస్తరణ, విజయనగరం జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి?, మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తప్పిస్తారా? సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు ఛాన్స్ ఉంటుందా..?

  ఇప్పుడు రాజన్నదొరకు మంత్రిపదవి వస్తే ఈ నియోజవర్గానికి రెండోసారి అమాత్యుని పదవి దక్కినట్టు అవుతుంది. గతంలో టీడీపీ హయాంలో సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన బోయిన రాజయ్య గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజన్నదొరకు గతంలో శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్‌గా, ప్యానల్‌ స్పీకర్‌గా కూడా పని చేసిన అనుభవం అయనకు ఉంది. ప్రస్తుతం శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.  అయితే ఈ సారి మాత్రం మంత్రి పదవి దక్కకపోతే..  వచ్చే ఎన్నికల నుంచి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని  ఆయన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana, Pamula Pushpa Sreevani, Rajanna, Vizianagaram, Ysrcp

  ఉత్తమ కథలు