హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ పై తాజా అప్ డేట్ ఇదే.. సీఎం జగన్ కీలక సమావేశం

AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ పై తాజా అప్ డేట్ ఇదే.. సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టి పెట్టారు. ఇప్పటికే మంత్రులతో రాజీనామా చేయించిన ఆయన.. తన టీమ్ లోకి ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

  కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టి పెట్టారు. ఇప్పటికే మంత్రులతో రాజీనామా చేయించిన ఆయన.. తన టీమ్ లోకి ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎవర్ని తీసుకోవాలని.. పాతవారిలో ఎవరికి అవకాశం కల్పించాలనేదానిపై దాదాపు 3గంటల పాటు చర్చజరిగినట్లు సమాచారం. గురువారం సమావేశం అనంతరం 24 మంది రాజీనామాలు చేయగా.. వారిలో ఐదు లేదా ఆరుగురుని కొనసాగించే అవకాశముందని మంత్రి కొడాలి నాని చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే శుక్రవారం సమీకరణాలు మారాయి. పాతవారిలో 10 మందిని కొనసాగిస్తారన్న వార్తలు బయటకు వచ్చాయి.

  ఈ నేపథ్యంలో సజ్జలతో సీఎం చర్చలు ఆసక్తికరంగా మారాయి. పాతవారిలో ఎవర్ని కొనసాగించాలి.. వారిని కొనసాగించేందుకు ఉన్న ప్లస్ పాయింట్స్, రాజకీయ, కుల సమీకరణాలు, సీనియారిటీ, సమర్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురైదుగురిపై క్లారిటీకి వచ్చిన సీఎం మిగిలిన వారిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?


  ఐతే సీఎంతో భేటీ తర్వాత మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మంత్రివర్గంపై చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్లోకి ఎవర్ని తీసుకోవాలనేది పూర్తిగా సీఎం నిర్ణయిస్తారని.. దానిపై చర్చించేది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ కాకుండా ఇతర అంశాలపైనే చర్చించినట్లు సజ్జల తెలిపారు.

  ఇది చదవండి: కేబినెట్లో కులాల లెక్కలు ఇవేనా..! వారికే సీఎం పెద్దపీట.. తగ్గనున్న రెడ్డి, కాపు మంత్రుల సంఖ్య..?


  ఇదిలా ఉంటే సీఎం కొనసాగించాలనుకుంటున్న పది మంది మంత్రుల్లో కొనసాగే మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, అంజాద్ భాషా, బొత్స సత్యనారాయణ, తానేటి వనితతో పాటు మరో ఒకరిద్దరిని కొనగిస్తారనిన ప్రచారం జరుగుతోంది. టీమ్ మొత్తాన్ని మార్చేస్తే పాలనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని సీఎం భావించారని.. అందుకే సమర్ధులైన పది మందికి మళ్లీ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

  ఇది చదవండి: మంత్రి పదవిపై రోజాకు సీఎం క్లారిటీ ఇచ్చేశారా..? ఆమెకు దక్కే పదవి ఇదేనా..?


  కొత్తగా 14 నుంచి 17 మంది కొత్త మంత్రులను సీఎం తీసుకోనున్నారట. ప్రస్తుతమున్నవారిలో దాదాపు ఏడు నుంచి పది మందిని తీసుకుంటారని సమాచారం. కొత్త జిల్లాలు, కుల సమీకరణాల వారిగా మిగిలిన వారిని ఎంపిక చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. హోంమంత్రిగా మళ్లీ మహిళకే ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేకతోటి సుచరితను కొనసాగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే మరో రెండు రోజుల్లో మంత్రివర్గంపై నెలకొన్న ఉత్కంఠ వీడిపోనుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: AP cabinet, Ap cm ys jagan mohan reddy, Sajjala ramakrishna reddy

  ఉత్తమ కథలు