హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: జనసేన-టీడీపీ పొత్తుపై సజ్జల ఆసక్తికర కామెంట్స్.. విజయసాయితో రిలేషన్ పై ఏమన్నారంటే.!

AP Politics: జనసేన-టీడీపీ పొత్తుపై సజ్జల ఆసక్తికర కామెంట్స్.. విజయసాయితో రిలేషన్ పై ఏమన్నారంటే.!

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Janasena) - టీడీపీ (TDP) పొత్తు పెట్టుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలసిందే. కలిసి పోరాడదామని, అవసరమైతే త్యాగాలు చేస్తామని చంద్రబాబు (Chandrababu) అనడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) స్పందించారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Janasena) –టీడీపీ (TDP) పొత్తు పెట్టుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలసిందే. కలిసి పోరాడదామని, అవసరమైతే త్యాగాలు చేస్తామని చంద్రబాబు (Chandrababu) అనడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) స్పందించారు. ఎన్నికలలో పొత్తులపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే వారు సమన్వయంతో ప్రకటనలు చేస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించారని.., బీజేపీలో కూడా టీడీపీ ఏజంట్లు సుజనా చౌదరిలాంటి వాళ్లు ఉన్నార కాబట్టి.., రేపు వాళ్ళు కూడా అదే స్టేట్ మెంట్ ఇస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల.

చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి... అధికారంలో లేకపోతే చీలకూడదని భావిస్తుంటారని సజ్జల విమర్శించారు. దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్టెట్ మెంట్లు ఇస్తుంటారన్నారు. పొత్తుల కోసం త్యాగం అంటూనే.. మరోవైపు నాయకత్వం వహిస్తానంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే శవం మాట్లాడుతున్నట్లుగా ఉంటుందని ఘాటుగా విమర్శించారు. తానే శాశ్వతంగా ఒక రాజులా ఉన్నాననుకుని ఊహించుకుని ప్రజలు తాను ఏది చెప్తే అది వింటారు అనే భావనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నిదెబ్బలు తగిలినా ఆయన అంతేనని.. పైగా అనుకూల మీడియా చంద్రబాబును భ్రమల్లో ఉంచుతున్నారన్నారు.

ఇది చదవండి: చంద్రబాబుకు బాదుడు తప్పదు.. అయ్యన్నకు అక్కాచెల్లెళ్లు లేరా..? మంత్రి రోజా ఫైర్..


చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు అది నమ్మడం లేదని.., రెండేళ్లలో రానున్న ఎన్నికల్లో మాకు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని.., సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలలోకి బలంగా వెళ్తున్నాయన్నారు. అందుకే ప్రతిపక్షాలు అభూత కల్పనలు చేస్తూ ప్రజలను కూడా నమ్మమని చెబుతున్నానయని.., కానీ చంద్రబాబులాంటి వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు.

ఇది చదవండి: నేటి నుంచి వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా.. 26,300 ఉద్యోగాల భర్తీ.., రిజిస్ట్రేషన్ ఇలా


తమ ప్రభుత్వంలో పైసా నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగిస్తున్నామని.. అవసరమైన పన్నులు విధించాల్సిన చోట ప్రజలకు వివరిస్తున్నామన్నారు. చంద్రబాబు సభలకు జనాన్ని తీసుకొచ్చి బలమని డ్రామా ఆడుతున్నారని సజ్జల విమర్శించారు. టీడీపీ నేతలు వాపును బలంగా అనుకోవద్దని హితవుపలికారు. జగన్ బయటకు వస్తే లక్షలమంది వస్తారన్నారు.

ఇది చదవండి: ఏపీకి చల్లని కబురు.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ముప్పు..?


ఇక తనకు, విజయసాయి రెడ్డికి మధ్య విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపైనా సజ్జల స్పందించారు. తాను, విజయసాయి పార్టీ కార్యకర్తలమని సీఎం జగన్ ఆదేశాల మేరకే నడుస్తామని స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్ కార్యకర్తలుగా ఇతర నాయకులకు అందుబాటులో ఉంటామని సజ్జల తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు