హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CPS: సీఎం తొందరపడ్డారని మంత్రి అంటే.. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సజ్జల స్పష్టం చేశారు.. మొత్తానికి సీపీఎస్ పై ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఇదే

CPS: సీఎం తొందరపడ్డారని మంత్రి అంటే.. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సజ్జల స్పష్టం చేశారు.. మొత్తానికి సీపీఎస్ పై ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఇదే

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

CPS: అది ముఖ్యమంత్రి తొందరపాటన్న మంత్రి బొత్స.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటున్నారు సజ్జల.. మొత్తానికి సీపీఎస్ రద్దు వద్దని.. ఓపీఎస్ ఆమోదం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  AP Government on CPS: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తొందరపడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.. కాసేపటి తరువాత మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల (Sajjala)  అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. మొత్తానికి ప్రభుత్వం అయితే సీపీఎస్ (CPS) పై స్పష్టతతో ఉంది.. ఇవాళ కేబినెట్ భేటీ.. తరువాత మంత్రి వర్గ ఉపసంఘం సమావేశాల తరువాత.. ఈ అంశాన్ని ఇంకా సాగదీయడం మంచిది కాదని ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. అందుకే సీపీఎస్ పై తమ విధానాన్ని స్పష్టత ఇచ్చేసింది.

  మరోవైపు సీపీఎస్ రద్దుపై వెనక్కు తగ్గేదే లేదు అంటున్నారు ఉద్యోగులు. ఈ నేపథ్యం లో ఈ రోజు రెండవ దఫా చర్చలు సీపీఎస్​పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది.  ఈ చర్చల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు.

  ఇదీ చదవండి : వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు

  ఉద్యోగుల కండిషన్లపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్ అయ్యింది.. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, ఆదిమూలపు సురేష్​లు పాల్గొని.. ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సీపీఎస్​ కంటే మెరుగైన జీపీఎస్​ తెచ్చామని మంత్రులు చెప్పినా అందుకు ఉద్యోగ సంఘాలు కుదరదని తేల్చి చెప్పేశాయి. ఓపీఎస్​ అమలు చేయాలని, జీపీఎస్​ ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు నేతలు చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 


  దీనిపై ఘాటుగానే స్పందించారు ఏపీ ప్రభత్వ ప్రధాన సలహాదారు సజ్జల.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే తాము పని చేస్తున్నామన్నారు. ఉద్యోగులు  వేరు ప్రభుత్వం వేరు కాదన్నారు. జీపీఎస్ తో అనేక లాభాలు ఉన్నాయన్న విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు.

  ఇదీ చదవండి : మహిళలకు శుభవార్త.. ఈనెల 22న వారి ఖాతాల్లో రూ.18,750 జమ.. అర్హులు ఎవరు..? ఎలా అప్లై చేసుకోవాలి.. రేపే ఫైనల్ లిస్ట్

  ఎన్నాళ్లుగానో ఉన్న ఈ సమస్యను ఉద్యోగులు.. అప్పుడెందుకు అడగలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని అన్నారు. సీపీఎస్ కంటే మెరుగైన జీపీఎస్ తెచ్చామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. జీపీఎస్‌లోనూ సదుపాయాలు ఇంకా పెంచుతామన్నారు. రిటైర్ అయ్యాక కనీసం  10 వేలు పింఛన్​ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో ఈ విగ్రహాలకు ఫుల్ డిమాండ్.. ఇంట్లో ఉంటే డబ్బే డబ్బే.. విగ్రహాలకు ఆ ఊరు ఫేమస్

  ఉద్యోగి, భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఉద్యోగి చనిపోయినా.. స్పౌజ్‌కు పింఛన్​ సదుపాయం ఇస్తామని తెలిపారు. అయితే జీపీఎస్‌ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయని బొత్స అన్నారు. ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చించే ప్రయత్నం చేస్తామన్నారు.

  ఇదీ చదవండి : నటి అర్చన గౌతమ్ వివాదానికి కారణం ఇదే.. టీటీడీ వాదన ఏంటి..?

  అలాగే జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తాం.. అసెంబ్లీలో చట్టం చేస్తాం.. సీపీఎస్ రద్దుపై మేం తొందరపడి హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో 95 శాతం హామీలు నెరవేర్చాం.. నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటి. కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. తీవ్రమైన కేసులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామనని బొత్స హామీ ఇచ్చారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees, Ycp

  ఉత్తమ కథలు