హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: పెట్టుబడుల విషయంలో దుష్ప్రచారం.. విపక్షాలపై మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి

AP Politics: పెట్టుబడుల విషయంలో దుష్ప్రచారం.. విపక్షాలపై మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

AP News: పదే పదే కడప స్టీల్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో విపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్టారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయనే బాధ విపక్షాల్లో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని వాళ్లే అంటుంటారని.. పరిశ్రమలు వస్తే అవి పరిశ్రమలే కాదని అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తోందని అన్నారు. నిబంధనల ప్రకారంగానే ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వెనక్కు పంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుదల విషయంలో కొందరు చేస్తున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చిన సీఎం జగన్‌కు బంధువులని ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విపక్షాలకు కొన్ని మీడియా సంస్థలు తోడుగా ఉన్నాయని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేది వీరి లక్ష్యంగా కనిపిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గత చంద్రబాబు(Chandrababu Naidu) ప్రభుత్వం పరిశ్రమలకు పద్దతి లేకుండా అనుమతులు జారీ చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వ హయంలో చేసిన పనులను విపక్షాలు మర్చిపోయాయని విమర్శించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం సంతోషకరమని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు.

రివర్స్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. అదానీ తమకు ఏమైనా బంధువా అని ప్రశ్నించారు. తమకు అదానీ బంధువని చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలని జగన్ కోరుకుంటారని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుది బరి తెగింపు వ్యవహరమని సజ్జల ఆరోపించారు.

AP-BRS: ఏపీలోని మాజీ అధికారిపై బీఆర్ఎస్ ఫోకస్.. ఆయన రియాక్షన్ ఏంటంటే..

AP Breaking News : ఏపీ హైకోర్టులో ఇప్పటం గ్రామస్థులకు మళ్లీ చుక్కెదురు

పదే పదే కడప స్టీల్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు .. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తాము పరిశ్రమలు తెస్తుంటే చంద్రబాబు వెటకారం చేస్తున్నారని విమర్శించారు. కొందరికి జగన్ అర్జంట్‌గా సీఎం పదవి నుంచి దిగిపోయి.. ఆ పదవిలో చంద్రబాబు కూర్చోవాలని ఉందని విమర్శించారు. అలా జరిగితేనే వీళ్లకు ప్రశాంతంగా ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు