హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala Ramakrishna Reddy: ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో.. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అయనదే అన్న సజ్జల

Sajjala Ramakrishna Reddy: ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో.. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అయనదే అన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. చర్చ మొత్తం పొత్తుల చుట్టూ తిరుగుతోంది. విపక్షాలు పొత్తులకు సై అంటుంటే.. ఆ పొత్తులపై వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

  Sajjala Rama Krishna Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు మొత్తం పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి..? అయితే టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పొత్తుల విషయంలో స్పష్టంగానే ఉన్నారు.. వైసీపీ (YCP) వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలి అంటే పొత్తుల అవసరం అనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.. ఇటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం సేమ్ అదే ఫీలింగ్ లో ఉన్నారు.. వైసీపీ ఓట్లు చీలకుండా ఉండేలా చేయడం.. అందరి బాధ్యత అని ఇతర పార్టీలకు పిలుపు ఇస్తున్నారు. అవసరమైతే అందుకోసం చర్చలు జరగాలి అంటూ మరో అడుగు ముందుకు వేస్తూ.. పొత్తుల కోసం చర్చలు అవసరం అంటున్నారు.. అందుకు బీజేపీని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తానని పరోక్షంగా చెప్పారు. కానీ ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు మాత్రం టీడీపీతో పొత్తుకు తమకు అవసరం లేదని స్పష్టంగా చెప్పేశారు.. అయితే ఇలా మూడు పార్టీలు.. మూడు వెర్షన్ లు చెప్పడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు..

  ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కడుపు మంట రాజకీయాలు దేశంలోనే మరెక్కడా లేవని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు.. ఎవరికి వారు తమను సీఎం అనుకుంటున్నారని.. ఎవరిని ఇద్దరూ ఫూల్స్ చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఒకపక్క త్యాగం అంటారు, మరోపక్క లీడ్ చేస్తానంటారు.. అసలు వీళ్లకు ప్రజలంటే లెక్క లేని తనంగా ఉందని సజ్జల మండిపడ్డారు. రెండు పార్టీల నేతలు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని.. అసలు ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు సాధ్యమా అంటూ సజ్జల ప్రశ్నించారు.

  ఇదీ చదవండి : పొత్తులపై యూటర్న్ తీసుకున్నారా..? చంద్రబాబు మాట్లకు అర్థం అదేనా..?

  అయినా పొత్తులు పెట్టుకుని వచ్చినా..సింగిల్ గా వచ్చినా.. ? జగన్ ను ఢీ కొట్టే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని.. చంద్రబాబు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. వీరిద్దరి బంధం కొనసాగుతూనే ఉంటుందని.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమ్ ఉందని ప్రజల్లో చర్చ కోసమే పొత్తులు అంటూ మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ఒంటరిగా పోటీ చేశాడని వీళ్లకు రాజకీయ అవసరాలే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవని సజ్జల ఆరోపించారు.

  ఇదీ చదవండి : : ఏపీలో మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? టీడీపీ -జనసేన పొత్తు ఫిక్స్ అయితే బీజేపీ స్టాండ్ ఏంటి?

  పవన్ మాట్లాడేది.. చేసే పనులు అన్నీ కేవలం చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ మాత్రేమే సజ్జల తీవ్ర ఆరోపణలుచేశారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా.. వ్యూహాలు పన్నినా వైసీపీ భయపడదన్నారు. ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిధ్దమవుతోందని ఎల్లుండి నుంచి ప్రజల్లోకి వెళుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan, Sajjala ramakrishna reddy

  ఉత్తమ కథలు