Sajjala: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి నారాయణ (Ex Minster Narayana) అరెస్ట్ విషయం రాజకీయ రచ్చకు వేదిక అవుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ (TDP) నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం కక్ష కట్టి నారాయణను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.. ప్రభుత్వ వైఫల్యాల డైవర్షన్ లో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఆ రోపణలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjaa Rama Krishna Reddy) స్పందించారు.. నారాయణనున కక్ష కట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే పదో తరగతి పేపర్ల లీకేజ్.. మాస్ కాపీయింగ్ అంశంలో తీగ లాగితే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మండిపడ్డారు.. నారాయణ (Narayana), చైతన్య (Chaitanya) విద్యా సంస్థల పర్యవేక్షణలోనే ఈ అక్రామలు జరిగాయి అని నిర్ధారణ అయ్యింది అన్నారు. చాలాకాలంగా ఈ సంస్థలు ఇలానే చేస్తున్నాయని.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు..
పోలీసుల విచారణలో అన్ని విషయాలు తేలియి అన్నారు.. తమ సంస్థలకు ర్యాంకులు, మార్కులు తెచ్చుకోవడానికి ఇలాంటి దారుణమైన పనులకు ఆ సంస్థలకు పాల్పడుతున్నాయి అన్నారు.. విద్యావ్యవస్థలో ఇలాంటి చీడ పురుగుల వల్ల.. విద్యార్థులు అందరూ శిక్ష అనుభవించాల్సి వస్తోందన్నారు.. ఇలా నేరాలకు పాల్పడే వారి విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని.. ఇలాంటి తప్పులు చేసే వారు ఎంత పెద్దవారైనా జగన్ విడిచిపెట్టరని ఆయన ఆరోపించారు.. నారాయణపై కక్ష కట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు సజ్జల.
ఇదీ చదవండి : కేసును లీగల్ గా ఎదుర్కొంటామంటున్న సింధు.. ఎవర్నీ వదలిపెట్టేది లేదన్న మంత్రి బొత్స
కేవలం జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు ఈ సంస్థలు ఇన్విజిలేటర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తాయని ఆరోపించారు.. అలాగే వార్డ్ బాయ్ లతో సమాధానాలు అందేలా చేస్తారని.. మాస్ కాపీయింగ్ కు సహకరించే ఇన్విజిలేటర్లకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తారని పోలీసుల విచారణలో తేలింది అన్నారు సజ్జల.. ఇప్పటికే ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగిందని.. త్వరలోనే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఇదీ చదవండి : ముంచుకొస్తున్న అసని తుఫాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం.. విమానాలు రద్దు
చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది అనేది నమ్మే వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు చేసిన ప్రయత్నం.. వాళ్లకే బెడిసి కొట్టిందని ప్రతిపక్ష టీడీపీపై కౌంటర్ వేశారు. పది పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఎప్పుడూ జరగని విషయం అన్నట్లు చంద్రబాబు మాట్లాడారు. కానీ, ఇవాళ దీనికి ప్రధాన కారణమైన వాళ్ల పార్టీ నాయకుడు నారాయణనే అని.. అందుకే ఆయన అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. నారాయణ సంస్థ ప్రమేయంతో లీక్ వ్యవహారం ప్రారంభం అయ్యిందని దృష్టికి రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి వ్యవహారం బద్దలైంది.. అరెస్టులు జరిగాయి. మాస్ కాపీయింగ్, పేపర్లు లీక్ కు స్పెషలిస్టులుగా మారిపోయారు వాళ్లు. చదువుకుని పోటీ తత్వంతో పిల్లలు ఎదగాలి తప్ప ఇలా అడ్డదారుల్లో కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తినా? చంద్రబాబు మంత్రిగా పెట్టుకుంది..! లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు అంటూ మాజీ మంత్రి, నారాయణ సంస్థల వ్యవస్తాపకుడు నారాయణపై మండిపడ్డారు సజ్జల.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Narayana, Sajjala ramakrishna reddy