ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో వారంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో కొత్తమంత్రులపై సజ్జల కామెంట్స్ చర్చకు తెరలేపాయి. సీఎం జగన్ తన ఎన్నికల టీమ్ ను సెట్ చేసుకుంటున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. దీంతో జగన్ టీమ్ లో ఎవరుంటారు.. ఎన్నికలకు కీలకం కాబోతున్న వారెవరనేదానిపై చర్చ జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేబినెట్ లో పెద్దపీట వేయబోతున్నట్లు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందిని కొనసాగించాల్సి వస్తోందన్నారు. వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఉంటుందనే రెండున్నరేళ్లలో మంత్రివర్గాన్ని మార్చే ఆలోచన దిశగా సీఎం వెళ్తున్నారని సజ్జల చెప్పారు.
ఇక కొత్త జిల్లాలపైనా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు అంతా పూర్తైందని.. ఇప్పటికే కార్యాలయాల ఎంపిక కూడా పూర్తైందన్నారు. జిల్లాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నుంచి కొత్త జిల్లాల పాలన మొదలవుతుందని సజ్జల చెప్పారు. కొత్త జిల్లాల కార్యాలయాలన్నీ 90శాతం ప్రభుత్వ భవనాల్లోనే ఉంటాయని ఆయన అన్నారు. కొత్తి జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండలా నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. శాశ్వత భవనాలు 15ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం చెప్పినట్లు సజ్జల ఆదేశించారు. 2023నాటికి కొత్త జిల్లాల శాశ్వత భవనాలను పూర్తి చేస్తాని చెప్పారు.
అమరాతి నిర్మాణంపై సజ్జల స్పందించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన సమస్య అని ఆయన అభిప్రాయడ్డారు. నిధులో లేనప్పుడు డెడ్ లైన్ విధించి పనులు పూర్తి చేయమంటే సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో ఒక్కో ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని అసెంబ్లీలో సీఎం జగన్ లెక్కలతో సహా వివరించారన్నారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించి అభివృద్ధి ఒకే చోట ఉంచితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిధులుంటే సింగపూర్ కంటే దాని తాతలాంటి క్యాపిటల్న నిర్మించవచ్చన్నారు. హైకోర్టు ఆచరణ సాధ్యంకాని ఆదేశాలిచ్చింది కాబట్టే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు సజ్జల స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే రాజధానిపై హైకోర్టు ఆదేశాలకు గడవు పూర్తికానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాజధాని పూర్తికి 2024 వరకు టైమ్ ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా నిధుల సమస్యతోనే నిర్మాణాలు నిలిచిపోయినట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.