హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. సిగ్గులేకుండా ఛాన్స్ అడుగుతారా..? సజ్జల ఫైర్..

Sajjala: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. సిగ్గులేకుండా ఛాన్స్ అడుగుతారా..? సజ్జల ఫైర్..

సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల వారీగా జరుగుతున్న వైసీపీ (YSRCP) ప్లీనరీ కార్యక్రమాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. కొందరు నేతలు స్వపక్షంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రతిపక్షాలపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల వారీగా జరుగుతున్న వైసీపీ (YSRCP) ప్లీనరీ కార్యక్రమాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. కొందరు నేతలు స్వపక్షంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రతిపక్షాలపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా (NTR District) వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Rama Krishna Reddy) హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు 2024 ఎన్నికలే చివరివని.. ఆ తర్వాత ఆయనకు సీన్ లేదని సజ్జల అన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయ నాయకుడని.. 2014-19 మధ్య ఆరచకాలు, అవినీతి రాజ్యమేలాయన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న సజ్జల.. బెంజి సర్కిల్, కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తి చేసిన ఘనత తమేదన్ని తెలిపారు.

విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమైందని.. నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టామన్నారు సజ్జల. విజయవాడలో 42 గుళ్ళు కూలగొట్టినన చరిత్ర చంద్రబాబుదని.., ధర్మ పోరాట దీక్ష పేరుతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రం అంతా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు టీడీపీని తరిమికొట్టారన్నారు. అమరావతి పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నించారని.., రాజధానిని నూజివీడు దగ్గర మొదలు పెట్టీ అమరావతి దగ్గర ఆపారన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ఇంత చేసిన చంద్రబాబు సిగ్గులేకుండా మరొకసారి అవకాశం అడుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తపనంతా బినామీలను రక్షించుకోవడం కోసమేనని విమర్శించారు.

ఇది చదవండి: గన్నవరం టికెట్ పై కొడాలి నాని క్లారిటీ.. స్నేహితుడికే ఓటు.. మళ్లీ రచ్చ తప్పదా..?


దేశంలోనే మహిళలకు 50 శాతం అవకాశం కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని.., రూ.1.65 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో నేరుగా మహిళల ఖాతాలో నగదు జమ చేశామని.., కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.., మద్యంలో విషయం ఉందని విష ప్రచారం చేస్తున్నారని.., ఇంత దారుణమైన ప్రతిపక్షం దేశం లోనే లేదని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో దోపిడీ కే పెద్దపీట వేశారన్నారు.

అబద్ధాలు, అవరోధాలతో టీడీపీ ముందుకు పోతోందన్న సజ్జల.., జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల అన్ని పార్టీల వాళ్ళు లబ్ధి పొందారని.., దళితులు, ఆగ్రా వర్ణ పేదలు అందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అన్నకాంటీన్ల పేరుతోనూ టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎలా దోచుకోవాలన్న ఆలోచన జగన్ కు లేదన్న సజ్జల.. 95 శాతం మానిఫెస్తో అమలు పరచామన్నారు. అమ్మఒడి తో పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేశామని చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy, Ysrcp

ఉత్తమ కథలు