హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala: ఇప్పటికీ రాజధాని అమరావతే.. సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నెగ్గిందన్న సజ్జల

Sajjala: ఇప్పటికీ రాజధాని అమరావతే.. సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నెగ్గిందన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

Sajjala: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై.. సుప్రీం కోర్టు తీర్పు తో సాహా షర్మిల అరెస్ట్ పై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే రాజధాని అమరావతే అని అన్నారు అయనా.. అలాగే ఇప్పటి వరకు తాము చెబుతున్నదే వాస్తవమి.. సుప్రీం తీర్పుతో తేలిపోయింది అన్నారు. సుప్రీం తీర్పుతో మరింత దూకుడుగా ముందుకు వెళ్తామన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Sajjala: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని (Capital) పై రచ్చ ఆగడం లేదు. విపక్షాలన్నీ అమరావతే రాజధని అంటుంటే..? ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులే ముద్దు అంటోంది. తాజగా దీనిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి (Amaravati).. త్వరలోనే మూడు రాజధానులపై చట్టం తీసుకొస్తామని అన్నారు సజ్జల.. రాజధానికి సంబంధించి ప్రభుత్వం, వైపీసీ స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నామన్న ఆయన.. మూడు రాజధానులపై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామన్నారు. గతంలో చట్టాన్ని వెనక్కి తీసుకున్నాం.. లేని చట్టంపై హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు.

రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్న ఆయన.. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని అమరావతి పూర్తి చేసేందుకు లక్షకోట్లు పైనే కావాలని.. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

అమరావతిలో మొత్తం ఖర్చు చేసి పూర్తిగా మునుగుదామా..? లేక రికవరి చేసే ప్రయత్నం చేద్దామా? అనేది చూడాలని సజ్జల అన్నారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు వృథా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇవాళ్టికి రాజధాని అమరావతే.. త్వరలో మూడు రాజధానులపై చట్టాన్ని తీసుకు వస్తాం.. మేం ఆషామాషిగా చట్టాన్ని తీసుకుని రాలేదన్నారు. న్యాయ ప్రక్రియకు లోబడే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువస్తామన్నారు.

ఇదీ చదవండి : లంబసింగిలో సరికొత్త ఆహ్లాదంతో పాటు థ్రిల్లింగ్.. ఆహ్వానం పలుకుతున్న బోటు షికారు..

వికేంద్రీకరణ చేయాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. న్యాయ స్థానాలు ఎలా వ్యవహరిస్తాయో చూసి చట్టం ఎప్పుడు చేయాలనే విషయమై ముందుకు వెళ్తామన్నారు. ఇక, అమరావతిలోనే రాజధాని పెట్టాలని పార్లమెంట్ ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు సజ్జల రామకృష్ణారెడ్డి . రాజధాని సంబంధించి ప్రభుత్వం, వైపీసీ స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నామన్న ఆయన చెప్పారు. రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్న ఆయన.. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. రాజధాని అమరావతి పూర్తి చేసేందుకు లక్షకోట్లు పైనే కావాలని.. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ఇదీ చదవండి : విద్యార్థులకు మరో శుభవార్త.. రేపు తల్లుల ఖాతాలోకి నగదు జమ చేయనున్న సీఎం జగన్

అలాగే తెలంగాణలో వైఎస్‌ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు ఆయన. షర్మిల అరెస్ట్‌ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Sajjala ramakrishna reddy, Supreme Court

ఉత్తమ కథలు