ఏపీలో BRSకు మద్దతుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితికి మద్దతు కావాలని కేసీఆర్ (Cm Kcr) అడిగితే పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఏపీలో BRS పోటీ చేస్తే మంచిదేనని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల అన్నారు. అయితే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని సజ్జల (Sajjala Ramakrishna Reddy) క్లారిటీ ఇచ్చారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలని అనుకున్నామని, అందుకే తెలంగాణాలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల (Sajjala Ramakrishna Reddy) తెలిపారు.
సీఎం కేసీఆర్ , జగన్ కు సన్నిహిత సంబంధాలు..
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. మొదటగా కర్ణాటక , ఏపీపై దృష్టి సారించిన BRS అధినేత కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో మాజీ సీఎం కుమారస్వామి మద్దతును కూడగట్టుకున్న గులాబీ బాస్ జేడీఎస్ తో కలిసి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే జగన్ కు కేసీఆర్ సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో వైసీపీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వచ్చాయి.
కర్ణాటకలో వైసీపీ పోటీపై సజ్జల క్లారిటీ..
కాగా కర్ణాటకలో వైసిపి పోటీ చేస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో వైసీపీ పోటీపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. తాము కర్ణాటకలో పోటీ చేయబోతున్నామనేది ఊహాగానాలే..మేము ఏపీకే పరిమితం అయ్యాం. కర్ణాటకలో పోటీ చేయాలనుకుంటే తమిళనాడులో కూడా చేయొచ్చు లేదంటే తెలంగాణాలో కూడా పోటీ చేయొచ్చని సజ్జల అన్నారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలని అనుకున్నామని, అందుకే తెలంగాణాలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు.
మరి ఏపీలో పోటీపై కేసీఆర్ జగన్ మద్దతు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, BRS, Sajjala ramakrishna reddy, Ycp