ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారని, ఆయన పార్టీలో ఊపు లేక ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు తాము అధికారంలో ఉంటామని అన్నారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని సజ్జల (Sajjala Ramakrishna Reddy) అన్నారు. పొత్తులు, ఎత్తులు లాంటి చచ్చు ఆలోచనలు తమకు లేవన్నారు. కౌలు రైతులకు సంబంధించి మెరుగైన విధానం ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పొచ్చని అన్నారు. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కోసం చంద్రబాబు ఎప్పుడూ మాయ మాటలు చెబుతుంటారని విమర్శించారు.
కాగా గతంలో కూడా సజ్జల కేసీఆర్ BRS,కర్ణాటకలో వైసిపి పోటీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితికి మద్దతు కావాలని కేసీఆర్ (Cm Kcr) అడిగితే పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఏపీలో BRS పోటీ చేస్తే మంచిదేనని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల అన్నారు. అయితే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని సజ్జల (Sajjala Ramakrishna Reddy) క్లారిటీ ఇచ్చారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలని అనుకున్నామని, అందుకే తెలంగాణాలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల (Sajjala Ramakrishna Reddy) తెలిపారు.
కాగా కర్ణాటకలో వైసిపి పోటీ చేస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో వైసీపీ పోటీపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. తాము కర్ణాటకలో పోటీ చేయబోతున్నామనేది ఊహాగానాలే..మేము ఏపీకే పరిమితం అయ్యాం. కర్ణాటకలో పోటీ చేయాలనుకుంటే తమిళనాడులో కూడా చేయొచ్చు లేదంటే తెలంగాణాలో కూడా పోటీ చేయొచ్చని సజ్జల అన్నారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలని అనుకున్నామని, అందుకే తెలంగాణాలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు.
మరి ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Sajjala ramakrishna reddy