హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసుండాలి.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలన్న సజ్జల

Breaking News: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసుండాలి.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

Breakin News: ఆంధ్రప్రదేశ్ విజభజనసై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే.. మొదట స్వాగతించేందుకు వైసీపీనే అన్నారు. రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని డిమాండ్ చేస్తూ.. ఉండవల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Breaking News:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల  రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) సంచనల వ్యాఖ్యలు చేశారు.  మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే మొదట స్వాగతించేందుకు వైసీపీ (YCP) నే అన్నారు. రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని.. లేదా సర్దుబాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కుదిరితే ఉమ్మడి ఏపీ మళ్లీ కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం అన్నారు.  విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాధనలు బలంగా వినిపిస్తామన్నారు.  రాష్ట్రం విభజన చేసిన తీరుపైనా కోర్టులో కేసులు వేశారన్నారు.  రాష్ట్ర విజభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోటీ చేస్తున్నది వైసీపీ ఒక్కటే అంటూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arunu Kumar) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.

అసలు ఉండవల్లి ఏమన్నారంటే..? బుధవారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అఫడవిట్ వేశారంటూ ఫైర్ అయ్యారు ఉండవల్లి. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

దీనిపై పోరాటం చేసే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కోర్టులో ఏపీ ప్రభుత్వం అడ్వకేట్ స్వయంగా వాధించారని.. అది జగన కు తెలియకుండా ఆయన అలా మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తెలియకుండా అలా ఎవరూ కోర్టులో వాధించరు అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడితే.. రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ఉండవల్లి ఆరోపించారు.

ఇదీ చదవండి : మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల.. ఈ విధంగా స్పందించారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం స్పష్టం చేశారు సజ్జల. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు