ఏపీ రాజకీయాల్లో అపర చాణుక్యుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీకి సలహాలివ్వడానికి రాబిన్ శర్మను నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కోసం రాబిన్ శర్మ పనిచేస్తున్నట్టు ప్రకటించలేదు. గతంలో పీకే వద్ద పనిచేసిన అనుభవంతో రాబిన్ శర్మ(Robin Sharma), తెలుగుదేశం పార్టీకి సలహాదారుగా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు, రాజకీయ పార్టీలకు సలహాదారులు అవసరమా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై(YS Jagan) సెటైర్లు వేసిన చంద్రబాబు(Chandrababu Naidu), మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మను నియమించుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అనధికార వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ బుర్ర నుంచి ఊడిపడిన కొత్త నినాదం ఇదేం ఖర్మ. తెలుగుదేశం పార్టీ ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో రాబిన్ శర్మ నేరుగా పాల్గొన్నారని తెలుస్తోంది. ఆయన మాసన పుత్రికే ఇదేం ఖర్మ. ఈ పేరును ప్రకటించగానే టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వ్యతిరేకించారట. అయినా చంద్రబాబు కోట్లు ఖర్చు చేసి నియమించుకున్నందుకు రాబిన్ శర్మ చెప్పిన టైటిల్ ఓకే చేయాల్సి వచ్చిందట.
గత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్ టైటిల్ కూడా ఆయన మస్తిష్కం నుంచి ఊడిపడిన గుళికే. అయితే అది బాగానే పాపులర్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాబిన్ శర్మ పార్టీని లేపే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 6 నెలల కిందట బాదుడే బాదుడుకు ప్లాన్ చేశారు. టీడీపీ నాయకులు బాగానే బాదుడే బాదుడులో పాల్గొన్నారు. టీడీపీకి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. తాజాగా ఇదేం ఖర్మ రిలీజ్ చేశారు. ఇది కూడా ప్రజల్లోకి బాగానే వెళుతోంది. రాబోయే రోజుల్లో రాబిన్ శర్మ విశ్వరూపం చూపే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకు రాబిన్ శర్మ చక్కగా ఉపయోగపడుతున్నారనే టాక్ వస్తోంది.
Ganta Political Game: గంటాకు కలిసివస్తున్న అంశం అదే..? ఆ లెక్కలతోనే డిమాండ్లు పెడుతున్నారా?
Delhi Liquor Scam: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర.. లిక్కర్ స్కామ్‌పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
గతంలో వైసీపీ పార్టీ వ్యూహకర్తగా పీకే పనిచేసినప్పుడు అనేక తప్పుడు వార్తలను వైరల్ చేశారు. కోడికత్తి కేసు, కోనసీమలో ట్రైన్ దహనం, పింక్ డైమండ్ అంటూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారు. అయితే రాబిన్ శర్మ కేవలం ప్రభుత్వ వైఫల్యాలనే నమ్ముకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరును, వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఇదే స్పీడ్ కొనసాగితే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ తురుపు ముక్కలా దొరికినట్టేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP