హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీపై ఫోకస్ చేస్తున్నారా ?.. ఇదేం లెక్క ?

ఆ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీపై ఫోకస్ చేస్తున్నారా ?.. ఇదేం లెక్క ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: తెలంగాణకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయ నేతల్లో ఎక్కువగా ఎన్నికల గురించే ఆలోచిస్తుంటారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలా అనే అంశంపై దృష్టి పెడుతంటారు. అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, జగ్గారెడ్డి.. కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని సమాచారం. రేణుక చౌదరి(Renuka Chowdary) ఇప్పటికే ఏపీకి వెళ్లి అమరావతి(Amaravati) రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ మాజీమంత్రి కొడాలి నానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో గుడివాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

  ఇక ఇటీవల ఏపీ అంశాలపై స్పందించిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy).. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. ఈ పేరు మార్పు సరికాదని.. లేనిపోని వివాదాలకు ఏపీ ప్రభుత్వం తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ రాజధాని అమరావతే అన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి తల్లికి ఏపీలోని మైలవరంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో సంగారెడ్డి నుంచి తన భార్య లేదా కూతురును పోటీ చేయించి.. తాను ఏపీ నుంచి పోటీ చేసే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.

  కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి త్వరలోనే ఆయన ఈ విషయాన్ని చెప్పబోతున్నారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితుల్లో.. జగ్గారెడ్డి కోరుకుంటే అక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. రేణుక చౌదరి విషయంలోనూ ఇదే జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ నేతలు ఏపీ నుంచి పోటీ చేసి ఆశించిన ఫలితాలు రాబట్టడం అంత ఈజీ కాదు. ఏపీ నేతలు తెలంగాణలో పోటీ చేస్తే.. వారిపై పోటీ చేసే వాళ్లు మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావొచ్చు.

  CM Jagan: రేపు నంద్యాలకు సీఎం జగన్ .. మరో ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం.. కానీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

  Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలు

  అదే జరిగితే.. పోటీలో ఉన్న నాయకులతో పాటు వారు పోటీ చేసే రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయం సీనియర్ నేతలకు తెలియనిది కాదు. అయినా రేణుక చౌదరి, జగ్గారెడ్డి వంటి వాళ్లు ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపించడం.. అవకాశం వస్తే అక్కడ పోటీ చేయాలని అనుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న తెలంగాణ నేతలు.. నిజంగానే తాము అనుకున్నది చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Jagga Reddy, Renuka chowdhury, Telangana