Home /News /andhra-pradesh /

AP POLITICS RECENT EX MINSTER KODALI NANI KEY COMMENTS ON JAGAN AND NO BERTH IN NEW CABINET HIS COMMENTS GOES VIRAL NGS

Kodali Nani: కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి..? ఆయన మాటలకు అర్థం అదేనా..?

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్.. తాజా మాజీ మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి సీఎం జగన్ ఎందుకు తప్పించారు..? 11 మందికి అవకాశం ఇస్తే.. అందులో కొడాలి లేకపోవడానికి కారణం ఏంటి..? సీఎం జగన్ ఆయనకు సీక్రెట్ గా ఏం చెప్పారు.. తాజాగా మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యల అర్థం అదేనా..?

ఇంకా చదవండి ...
  Kodali Nani Comments on CM Jagan: సీఎం జగన్ (CM Jagan) కు వీర విధేయుడు.. వైసీపీ (YCP)లో రియల్ ఫైర్ బ్రాండ్.. చంద్రబాబు (Chandrababu) పేరు ఎత్తితే చాలు అంత ఎత్తున ఎగిరిపడే వాయిస్.. మైక లేకపోయినా రీసౌండ్ చేయగల గొంతు.. విపక్షం ఏదైనా మాటల తూటాలు పేల్చగలిగే సమర్థుడు.. ఆమ్మో కొడాలి నాని అని ప్రతిపక్షాలను భయపెట్టే నైజం.. ప్రతిపక్ష నేత సామాజికి వర్గానికి చెందిన కీలక నేత.. గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎందరు మారిని.. రికార్డు మెజార్టీ సాధిస్తున్న రికార్డు.. ఇన్ని లక్షణాలు ఉన్న తాజా మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కచ్చితంగా మరో ఛాన్స్ ఉంటుందని అంతా ఊహించారు. మొదట ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే మంత్రి మండలిలో కొనసాగిస్తారని చెప్పినప్పుడు ఆయన్ను కూడా తప్పిస్తే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోయేవారు కాదు.. కానీ పాత కేబినెట్ నుంచి 11 మందిని కొనసాగించారు. అందులో కొడాలి నాని లేకపోవడంతో అంతా షాక్ అయ్యారు.. కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే.. ఆయన సామాజిక వర్గానికి కనీసం ప్రాతినిథ్యం లేకుండా పోయింది. దీనిపై స్పందించిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  అందరిలా తనకు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు కొడాలి. తిరిగినంత మాత్రాన తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబులా పదవుల కోసం.. సొంత మామను వెన్ను పోటు పొడిచే టైపు తనది కాదన్నారు. తాను కేవలం పార్టీకోసం పనిచేస్తానని పదవులు తనకు ముఖ్యం కదాన్నారు. 11 మంది పాతవాళ్లకు అవకాశం ఇచ్చి.. తమను తప్పించారు అంటే.. మమ్మల్ని జగన్ తన మనుషులు అనుకుంటున్నారని అర్థం అని వివరణ ఇచ్చారు నాని. అందుకే వీరిని తీసినా.. ఎలాంటి సమస్య ఉండదు అంటూ నాని అభిప్రాయపడ్డారు.. అయితే ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. అంతే ఎవరి వల్ల సమస్య వస్తుందని భావించారో వారికి మాత్రమే మంత్రి పదవులు తిరిగి ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.

  ఇదీ చదవండి : రాజీనామాకు కారణం అదే.. మాజీ హోం మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

  అలాగే సింపతీ కబుర్లకు.. విపక్షాల ప్రలోభాలకు ఎవరూ ప్రలోభాలకు గురికావొద్దంటూ నాని సలహా ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో జగన్ అంత నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరూ లేరన్నారు. ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాలకు పదవులు, రాజ్యాధికారం ఇచ్చారని.. అందకే ఆయన చనిపోయిన 25 ఏళ్ళ తర్వాత కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. ఆ తర్వాత జగన్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారన్నారని గుర్తు చేశారు.  తాను కేవలం మంత్రి పదవి కోసమే ఎవరినీ తిట్టలేదన్నారు. తనకు మంత్రి పదవి వెంట్రుకతో సమానమన్నారు. చంద్రబాబు లాంటి వారు పదవుల కోసం, ఎంగిలిమెతుకుల కోసం తిరుగుతారని మండిపడ్డారు.

  ఇదీ చదవండి : దళిత మహిళకు హోం శాఖ.. డిప్యూటీగా రాజన్నదొర.. ఫైనల్ లిస్ట్ ఇదే

  జగన్ గ్యారేజ్ లాంటి వ్యక్తి అని.. ఆయన్ని కాపాడుకుందామని అసమ్మతి నేతలకు పిలుపు ఇచ్చారు. జగన్ కి అంతా మద్దతివ్వాలని.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నతస్థానంలో అధికారం అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. మాజీలయిన తామంతా తమ గౌరవం కోసం తిరగడం లేదని.. సీఎం ఏం నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామన్నారు. అయినా జగన్ తనకు ఓ హామీ ఇచ్చారని.. అది ఆయనకు తనకు మాత్రమే తెలుసు అన్నారు. అంటే అతి త్వరలో కొడాలికి జగన్ పెద్ద పదవి ఇవ్వబోతున్నారా.. మరి ఆ పదవి ఏమై ఉంటుంది. కొడాలి నాని మాటలకు అర్థం ఏంటని ఆయన అనుచరులు ఆరా తీస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, Kodali Nani

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు