హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: మోదీ సభకు వచ్చి తీరుతా.. భద్రత ఇచ్చే బాధ్యత జగన్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన రఘురామ..? సాధ్యమేనా..?

RRR: మోదీ సభకు వచ్చి తీరుతా.. భద్రత ఇచ్చే బాధ్యత జగన్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన రఘురామ..? సాధ్యమేనా..?

జనగ్ రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరిన రఘురామ

జనగ్ రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరిన రఘురామ

RRR: ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. దీంతో బీజేపీ సైతం ఇక్కడి రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్టు అయ్యింది. మరోవైపు మోదీ సభ ఈ సారి హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం రెబల్ ఎంపీ రఘురామ రాజే.. మ్యాటర్ ఏంటంటే?

ఇంకా చదవండి ...

RRR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే జనం బాట పట్టాయి కూడా.. ముఖ్యంగా టీడీపీ (TDP) , జనసేన (Janasena) లైతే ముందస్తు ఎన్నికలు తప్పవని భావిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయంగా హీట్ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minster Narendra Modi) ఏపీకి వస్తుండడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే ప్రధాని మోదీ వస్తే.. ఆయనతో పాటు నియోజకవర్గానికి వెళ్లొచ్చని రెబల్ ఎంపీ రఘురామ రాజు (Rebal MP Raghurama Raju) భావిస్తున్నారు. దీంతో నిజంగానే రఘురామ అంత సహాసం చేస్తారా..? ప్రధానితో కలిసి వస్తే ప్రమాదం ఏదీ ఉండదు అనుకుంటున్నారా..? ఎందుకంటే ఇంతకాలం ఏపీకి రావాలి అంటే.. వైసీపీ నేతల, అభిమానుల నుంచి ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సొంత నియోజకవర్గానికి వస్తే ఎలాంటి సమస్య ఉండదని లెక్కలు వేసుకున్నట్టు సమాచారం.

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేధించి దూరమైన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ ఏకంగా ఢిల్లీకే మకాం మార్చారు. అప్పటి నుంచి తిరిగి తన నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టలేదు. గతంలో పలుమార్లు నియోజకవర్గానికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన రఘురామ.. ఈసారి ప్రధాని మోడీ భీమవరం టూర్ ను అడ్డుపెట్టుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కేంద్రాన్నే భద్రత కోరుతున్నారు.

తన సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి వచ్చేందుకు కొంతకాలంగా శత విధాలా ప్రయత్నిస్తున్న రఘురామరాజు.. త్వరలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ భీమవరానికి వస్తున్న జూలై 4వ తేదీన ఎలాగైనా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. ఓవైపు తనకు రక్షణ లేదంటూనే మరోవైపు భీమవరానికి వెళ్లాలని భావిస్తున్న రఘురామ దీనికోసం నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించారు. గతంలో ఓసారి కేంద్రాన్ని ఆశ్రయించి వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ... ఇప్పుడు మరోసారి తనకు భీమవరం టూర్ లో భద్రత కోరుతున్నారు.

ఇదీ చదవండి : నేను విన్నాను నేను ఉన్నాను అంటున్న ఏయూ స్టూడెంట్.. అచ్చం జగన్ ను దింపేస్తున్నాడుగా.. మీరే చూడండి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను, హోంశాఖ కార్యదర్శిని కలిసిన రెబెల్ ఎంపీ రఘురామ జూలై 4న ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తాజాగా విశాఖ లో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించినా తనను అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. అందుకే ప్రధాని మోడీ భీమవరం టూర్ లో తనకు తగిన భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని రఘురామ కోరారు. దీనిపై హోంశాఖ నుంచి తక్షణం ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేదు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, MP raghurama krishnam raju, PM Narendra Modi