హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: జగన్ వారిని అందుకే పట్టించుకోలేదా ?.. ఇంకా ఆ ఆలోచన ఉందా ?

YS Jagan: జగన్ వారిని అందుకే పట్టించుకోలేదా ?.. ఇంకా ఆ ఆలోచన ఉందా ?

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

AP Politics: నిజానికి సీఎం జగన్‌ శాసనమండలిని రద్దు చేయాలని భావించారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు.

  ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. కేబినెట్‌లో కొందరు పాతవారిని కొనసాగించి.. ఎక్కువగా కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ టీమ్‌తోనే రాబోయే ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. అందుకే కొత్త మంత్రివర్గ కూర్పు విషయంలో సీఎం జగన్ ఎంతో కసరత్తు చేశారు. మంత్రివర్గ ఏర్పాటు తరువాత ఏర్పడిన అసంతృప్తి సెగలను చల్లార్చడంలోనూ వైసీపీ నాయకత్వం తొందరగానే సక్సెస్ అయ్యింది. ఇక కొత్త మంత్రివర్గం కూర్పు విషయంలో సీఎం జగన్(YS Jagan Mohan Reddy) కొన్ని వర్గాలను, కొన్ని కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోలేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గంలో ఏ ఒక్క శాసనమండలి సభ్యుడికి కూడా జగన్ చోటు కల్పించకపోవడం మరో విశేషం.

  రాష్ట్రంలో పెద్దల సభగా చెప్పుకునే శాసనమండలిలో వైసీపీకి(Ysrcp) మెజార్టీ ఉంది. అక్కడ మంత్రివర్గంలో పని చేసిన అనుభవం ఉన్న నేతలు కూడా ఉన్నారు. కానీ సీఎం జగన్ మాత్రం వాళ్లెవరినీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో పరిగణనలోకి తీసుకోలేదు. అయితే వైసీపీకి ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లోనే కేబినెట్ బెర్త్‌ల విషయంలో పోటీ ఎక్కువగా ఉందని.. అందుకే సీఎం జగన్ శాసనమండలి(Legislative Council) సభ్యులను కేబినెట్‌లోకి తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పలువురు చెబుతున్నారు.

  మరోవైపు మంత్రివర్గంపై వైసీపీ మండలి సభ్యులెవరూ కూడా ఆశలు పెట్టుకోలేదు. వాళ్లెవరికీ సీఎం జగన్ కేబినెట్ స్థానంపై హామీ కూడా ఇవ్వలేదు. అందుకే అక్కడి నేతలెవరూ తమకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తి చెందలేదు. అయితే సీఎం జగన్ మండలి సభ్యులను కేబినెట్‌లోకి తీసుకోకపోవడం వెనుక శాసనసభ్యుల సంఖ్యే కారణమా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? అనే చర్చ కూడా జరుగుతోంది.

  AP Cabinet: కూరలో కరివేపాకులా కీలక జిల్లా.. సీఎం జగన్ నిర్ణయంపై వైసీపీ నేతల షాక్..

  Ex Minster Anil: ప్రమాణ స్వీకారానికి అందుకే వెళ్లలేదు.. రిటన్ గిఫ్ట్ ఇస్తా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

  నిజానికి సీఎం జగన్‌ శాసనమండలిని రద్దు చేయాలని భావించారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. అయితే ఆ తరువాత కాలక్రమంలో మండలిలో వైసీపీకి మెజార్టీ రావడంతో.. ముఖ్యమంత్రి ఈ విషయంలో మనసు మార్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మండలి సభ్యులెవరినీ సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో.. మండలిని రద్దు చేయాలనే ఆలోచన సీఎం జగన్ మదిలో ఇంకా అలాగే ఉందేమో అనే చర్చ మొదలైంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు