Home /News /andhra-pradesh /

AP POLITICS REASON BEHIND TDP SILENCE ON JANASENA PRESIDENT PAWAN KALYAN COMMENTS ON ALLIANCE WITH OTHER PARTIES IN ANDHRA PRADESH AK

AP Politics: పవన్ కళ్యాణ్ ఆఫర్‌పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా ?

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

TDP-Pawan Kalyan: జనసేనతో పొత్తు అన్నది పవన్ కళ్యాణ్ కాకుండా బీజేపీ సూచించిన విధంగా ఉంటుందనే భావనలో టీడీపీ ఉందని.. అందుకే ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించడం లేదని తెలుస్తోంది.

    ఏపీలో రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సిద్ధమవుతుంటే.. విపక్షాలు ప్రభుత్వంపై పోరాటం విషయంలో దూకుడు పెంచే పనిని మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరేపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ టీడీపీకి ఆనందం కలిగించాలి. కానీ టీడీపీ (Tdp) నేతలు మాత్రం ఈ విషయంలో ఏ రకంగానూ రియాక్ట్ కావడం లేదు. ఇందుకు కారణం ఏంటనే దానిపై కూడా ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యల్లో అర్థం వేరుగా ఉంది. ఒకవేళ వైసీపీ(Ysrcp) వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినా.. పెద్దన్న పాత్ర మాత్రం తమకే ఇవ్వాలనే యోచనలో బీజేపీ, జనసేన ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రం బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక అసలు కారణం కూడా ఇదేననే చర్చ జరుగుతోంది. రాజకీయంగా జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను డీల్ చేయడం అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు(Chandrababu Naidu) పెద్ద కష్టమేమీ కాదు.

    కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరిగా లేరు. ఆయన బీజేపీతో మిత్రబంధంలో ఉన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఏపీలో వైసీపీపై పోరాడతామని ప్రకటించారు. దీన్ని బట్టి ఆయన బీజేపీ సూచనలతోనే ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో జనసేనతో పొత్తు అన్నది పవన్ కళ్యాణ్ కాకుండా బీజేపీ సూచించిన విధంగా ఉంటుందనే భావనలో టీడీపీ ఉందని.. అందుకే ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించడం లేదని తెలుస్తోంది.

    YS Jagan: విద్యార్థులకు శుభవార్త.. రేపే వారి ఖాతాల్లోకి డబ్బులు

    TDP: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టీడీపీ నేతల్లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..

    ఈ అంశంపై నేతలు ఏది మాట్లాడినా.. ఆ తరువాత అది లేనిపోని తలనొప్పులను తెచ్చిపెట్టే అవకాశం ఉందనే భావనలో టీడీపీ నాయకత్వం ఉందని.. అందుకే ఈ విషయంలో మౌనంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి పొత్తులకు తాము సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించినా.. షరతులు వర్తిస్తాయనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీ డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Chandrababu Naidu, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు