Home /News /andhra-pradesh /

AP POLITICS REASON BEHIND JR NTR REACTION ON AP GOVERNMENT NAME CHANGE OF NTR HEALTH UNIVERSITY AK

Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ అందుకే రియాక్ట్ అయ్యారా ?.. టీడీపీకి ఛాన్స్ లేకుండా చేశారా ?

 జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

Jr Ntr: గతంలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలపై ఆయన అప్పుప్పుడు స్పందిస్తుంటారు. తాజాగా ఏపీలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తన ట్విట్‌లో ఎన్టీఆర్ పేరు తొలగించడం సరికాదని చెబుతూనే.. వైఎస్ఆర్(YSR) కూడా గొప్ప నాయకుడే అనే విధంగా కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తగదనే విధంగా తారక్ కామెంట్ చేశారు. టీడీపీ స్థాయిలో వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడకపోయినా.. తనదైన శైలిలోనే ఈ పేరు మార్పు అంశంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందిస్తారని చాలామంది అనుకోలేదు. వైసీపీ (Ysrcp) అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పేర్లను మార్చింది. చాలా పథకాలకు వైఎస్ఆర్ పేర్లను పెట్టింది. కానీ తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తరువాత టీడీపీ తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది. చంద్రబాబు , లోకేశ్ సహా టీడీపీ నేతలంతా ఈ అంశంపై గట్టిగానే స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఎన్టీఆర్ అంటే తనకు దైవంతో సమానమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. అలాంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే.. ఆయనను టీడీపీ నేతలు టార్గెట్ చేసే వారనే చర్చ కూడా జరిగింది. గతంలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంలో కాస్త మెత్తగా స్పందించడాన్ని కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కుటుంబసభ్యులపై ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై.. ఈరకంగా స్పందించడం ఏంటని విమర్శించారు. Jr NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తారక్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? Jr NTR-kodali Nani: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయంలో స్పందించడం ఏ మాత్రం ఆలస్యం జరిగినా.. టీడీపీ నేతల నుంచి ఈ రకమైన విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదని జూనియర్ ఎన్టీఆర్ భావించి ఉంటారని.. అందుకే ఈ అంశంపై తన అభిప్రాయాన్ని, అసంతృప్తిని తనదైన శైలిలో వ్యక్తం చేశారని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఈ అంశంపై రియాక్ట్ కావడం ద్వారా అటు టీడీపీ నేతలకు తనపై విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంతృప్తి చెందేలా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Jr ntr, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు