హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వెనుక అసలు కారణం ఇదేనా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వెనుక అసలు కారణం ఇదేనా ?

 పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: టీడీపీ నుంచి నారా లోకేశ్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఒకేసారి దసరా నుంచే మొదలవుతాయని.. అలా ఏపీలో పొలిటికల్ హీట్ షురూ అవుతుందని చాలామంది భావించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో రాణించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో భావించారు. టీడీపీ నుంచి నారా లోకేశ్ పాదయాత్ర, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఒకేసారి దసరా నుంచే మొదలవుతాయని.. అలా ఏపీలో పొలిటికల్ హీట్ షురూ అవుతుందని చాలామంది భావించారు. కానీ నారా లోకేశ్ పాదయాత్ర సంక్రాంతికి వాయిదా పడగా.. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర (Bus Yatra)కూడా వాయిదా పడింది. అయితే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడటం వెనుక ఆయన నటిస్తున్న ఓ సినిమానే కారణమనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటించేందుకు కమిటైన పవన్ కళ్యాణ్.. ముందుగా క్రిష్ డైరెక్షన్‌లో నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

  ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డేట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్‌ను వాళ్లు రిక్వెస్ట్ చేశారని.. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బస్సు యాత్ర మొదలుపెట్టాలని డిసైడయ్యారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

  హరిహర వీర మల్లు సినిమా విడుదలైన తరువాత బస్సు యాత్ర చేపడితే.. పొలిటికల్‌గా మంచి జోష్ ఉంటుందని.. జనసేనకు అది కలిసొచ్చే అంశంగా మారుతుందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఆయనకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడటానికి హరిహర వీర మల్లు సినిమాతో పాటు ఏపీ రాజకీయ పరిణామాలు కూడా ఓ కారణమనే చర్చ జరుగుతోంది.

  Chiranjeevi: చిరంజీవి పేరుతో పీసీసీ కార్డు.. రాజకీయం దూరం కాలేదంటే ఇదేనా ?

  ఏపీలో ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేదని.. అందుకే మరికొంతకాలం వేచి చూసే ధోరణి అవలంభించడం మంచిదనే అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సందడి మొదలుకావడానికి కొన్ని నెలల ముందు బస్సు యాత్ర చేపడితే.. మంచి ఫలితాలు రావొచ్చనే భావనలో పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి దసరా నుంచి ఏపీలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్.. తాను నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ కోసం కొంతకాలంపాటు తన పొలిటికల్ టూర్‌ను వాయిదా వేసుకున్నట్టు అర్థమవుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు