హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కేవీపీ ఏమయ్యారు... అందుకే జగన్‌కు దూరం

కేవీపీ ఏమయ్యారు... అందుకే జగన్‌కు దూరం

జగన్, కేవీపీ

జగన్, కేవీపీ

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవీపీ మళ్లీ జగన్‌కు దగ్గరవుతారని... పాలనలో ఆయనకు సలహాలు ఇస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు.

ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు... వైఎస్ మరణం తరువాత జగన్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నా... కేవీపీ మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. జగన్‌పై కేవీపీ, కేవీపీపై జగన్ ఎప్పుడూ విమర్శలు చేయకపోయినా... ఇద్దరి మధ్య దూరం అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవీపీ మళ్లీ జగన్‌కు దగ్గరవుతారని... పాలనలో ఆయనకు సలహాలు ఇస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు.

ఇందుకు కారణం ఏమటనే విషయాన్ని ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన ఉండవల్లి... జగన్‌కు కేవీపీ దూరంగా ఉండటంలో ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని అన్నారు. ఎవరి సొంత టీమ్‌ను వారు తయారు చేసుకుంటారని... ఈ క్రమంలోనే జగన్ కూడా తన సొంత టీమ్‌ను తయారు చేసుకున్నారని ఉండవల్లి అన్నారు. ఆయన టీమ్‌లో ఎవరుండాలో విషయం ఆయన ఇష్టమని... తాము అందులో ఉన్నా... లేకపోయినా... పెద్దగా ఇబ్బందేమీ ఉండదని తెలిపారు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Kvp ramachandra rao, Undavalli Arun Kumar, YSR

ఉత్తమ కథలు