హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Chandrababu: టార్గెట్ కుప్పం.. చంద్రబాబు ఆ రెండింట్లో ఏం చేసినా లాభమే.. వైఎస్ జగన్ వ్యూహం

YS Jagan-Chandrababu: టార్గెట్ కుప్పం.. చంద్రబాబు ఆ రెండింట్లో ఏం చేసినా లాభమే.. వైఎస్ జగన్ వ్యూహం

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

AP Politics: గతానికి భిన్నంగా కుప్పంలో ఇంటిని నిర్మించుకునేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తద్వారా కుప్పంపై గతం కంటే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అడుగుపెట్టారు. కుప్పంలో(Kuppam) జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబును తనదైన శైలిలో టార్గెట్ చేశారు. చంద్రబాబు(Chandrababu)  ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించిన కుప్పంకు.. చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంకు నాన్ లోకల్ అంటూ విమర్శించారు. నిజానికి చాలాకాలంగా వైసీపీ కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. కుప్పం మున్సిపాలిటీకి కూడా సొంతం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని సవాల్ చేసింది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ముఖ్యనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra reddy)తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు.

  నిజానికి కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసీపీకి అంత తేలికైన విషయమేమీ కాదు. అది అసాధ్యం కాకపోయినప్పటీ.. ఇందుకోసం వైసీపీ ఎంతగానో శ్రమించాల్సి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేయడం వెనుక వైసీపీ ప్లాన్ మరోలా ఉందనే చర్చ జరుగుతోంది. కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టడం వల్ల ఆయన సొంత నియోజకవర్గంలో గెలిచేందుకు కష్టపడుతున్నారనే సంకేతాలు టీడీపీ వర్గాలు, ప్రజల్లోకి బలంగా వెళతాయి.

  గతానికి భిన్నంగా కుప్పంలో ఇంటిని నిర్మించుకునేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తద్వారా కుప్పంపై గతం కంటే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కుప్పంలో తన పట్టు జారిపోకుండా ఉండేందుకు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలుసార్లు నియోజకర్గం మొత్తం పర్యటించారు. ఇలా చంద్రబాబు కుప్పంపై ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా టీడీపీ బలహీనపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.

  Jr NTR vs TDP: టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం..! కారణం అదేనా?

  YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

  ఒకవేళ చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని వదిలేసి చంద్రబాబు మరో సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటే.. అది కూడా వైసీపీకి లాభమే అవుతుంది. కుప్పంలో ఓడిపోవడం ఖాయమనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అలా చేస్తున్నారనే ప్రచారాన్ని వైసీపీ జనంలోకి తీసుకెళుతుంది. ఈ రకంగా కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం ద్వారా చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని.. అది తమకు లాభం చేకూర్చడంతో పాటు చంద్రబాబును టెన్షన్ పెడుతుందని వైసీపీ భావిస్తోంది. అదే జరిగితే.. ఆ ప్రభావం కేవలం చంద్రబాబు మీదే కాకుండా మొత్తం టీడీపీపై ఉంటుందని వైసీపీ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Kuppam

  ఉత్తమ కథలు