ఏపీ సీఎం జగన్కు రాయలసీమ నేతలు లేఖ రాశారు. గ్రేటర్ రాయలసీమను రాజధాని చేయాలని కోరారు. గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలు ప్రాంతాన్ని సీమ ప్రజలు త్యాగం చేశారన్నారు. సీమ ప్రజల త్యాగాలు వృథా కాకూడదన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణను సమర్థిస్తున్నామన్నారు. లేఖ రాసిన వారిలో రాయలసీమ నేతలు మైసూరా రెడ్డి, శైలాజానాథ్, దినేష్ రెడ్డి. ఈ సందర్భంగా మైసూరా రెడ్డి మాట్లాడుతూ... మాకు న్యాయం జరగాలన్నారు. రాజధాని అయితే రాయలసీమ ప్రాంతలో రావాలన్నారు. రాజధాని ఇవ్వకుంటే మా ప్రాంతాన్ని మాకివ్వండి. మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలి. మేం ఏం ఆంధ్రా వాళ్లతో కలిసి అలింగనం చేసుకొని ఉంటానడం లేదు.
అమరావతి రైతులు చేసింది త్యాగం కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నారు మైసూరా రెడ్డి. అమరావతి రైతుల్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు. కానీ రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలు చేసింది మాత్రం త్యాగమన్నారు. హైకోర్టు తరలించినప్పుడు కర్నూలులో ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు, విద్యావంతులు మాత్రమే కొరారున్నారు. ఎప్పుడూ మేం మాత్రమే త్యాగం చేయాలా ? అంటూ ప్రశ్నించారు. గ్రేటర్ రాయలసీమను సపరేట్ చేయాలన్నారు. కనీసం రాజధాని ఇవ్వాలనడం న్యాయసమ్మతమే అన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా రాయలసీమ వాసులు కాబట్టి వాళ్లు విజ్ఞతతో ఆలోచించి రాయలసీమపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కేవలం లేఖ రాసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలిపెట్టాం. ఏపీ కేబినెట్ రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు మైసూరా రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Ap cm jagan, AP Politics, Rayalaseema