హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీ వాయిదా... కారణం అదేనా ?

ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీ వాయిదా... కారణం అదేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రేషన్ కార్డు ఉన్నవాళ్లు ..ఎప్పటిలాగానే.. రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే వాలంటీర్ల ద్వారా సరుకుల పంపిణీని ఇంటింటికి చేరవేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సరుకుల పంపిణీ వాయిదా పడింది. కొత్తగా నియమితులైన వాలంటీర్లకు ఈ బాధ్యతను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్న వాలంటీర్లు తమకు అప్పగించిన పనుల్ని సక్రమంగా చేసుందుకు కుస్తీ పడుతున్నారు. మరి ఈసమయంలో వారికి కీలకమైన పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సరుకుల పంపిణీ బాధ్యతలు చేపట్టడంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో తాత్కాలికంగా ఇంటింటికి సరుకుల పంపిణీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ..ఎప్పటిలాగానే.. రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే వాలంటీర్ల ద్వారా సరుకుల పంపిణీని ఇంటింటికి చేరవేస్తున్నారు. కొందరు వచ్చేనెలలో అవసరమైన సరుకుల కోసం ఇప్పటికే డీడీలు కూడా చెల్లించారు.

ప్రస్తుతానికి వాలంటీర్లు తమకు కేటాయించిన కుటుంబాలను కలుసుకొని పరిచయం చేసుకుంటున్నారు. ఇళ్ల స్థలాలకు అర్హుల కోసం త్వరలో విచారణ చేపట్టనున్నారు. గ్రామాల్లో 50. నగరంలో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను కేటాయించారు. గ్రామాల్లో కుటుంబాల కేటాయింపుపై పెద్దగా ఇబ్బంది లేదు.నగరంలో 100 కుటుంబాలు అంటే ఒక్కొక్క ఇంటి నెంబర్‌లో ఐదారు కుటుంబల్ని పరిగణలో తీసుకోవాలి. నగరానికి సంబంధించి ఇళ్ల వివరాల్ని ఇప్పటికే డ్వాక్రా మహిళలు, రీసోర్స్ పర్సన్ల ద్వారా సేకరించి జీవీఎంసీకి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక మేరకు సరుకుల పంపిణీ బాధ్యత వాలంటీర్లకు అప్పగించనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ration card

ఉత్తమ కథలు