GT Hemanth Kumar, News18, Tirupati
Gang Rape on Hijra: తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు రక్షణే ప్రశ్నార్థకంగా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోటు మానంభంగం వార్తలు వినాల్సి వస్తోంది. ప్రభుత్వాలు కఠిన చట్టాలు ప్రవేశ పెడుతున్నా..? కీచకుల దురాగతాలకు అడ్డుకట్ట పడడం లేదు. కేవళం మహిళలనే కాదు.. యువతులు, చిన్నారులు.. మండు ముసలిని కూడా వదలడం లేదు.. ఇంకా దారుణం ఏంటంటే.. చీర కడితే హిజ్రాలను కూడా వదలడం లేదు దుర్మార్గులు. ఇటీవల జరుగుతున్న గ్యాంగ్ రేవు (Gang Rape) లు కలకలం సృష్టిస్తున్నాయి. దేశంలో ఏదో ఒకటోట.. మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ట్రాన్స్ జండర్స్ (Trans Gender) కు సైతం రక్షణ ఉండడం లేదు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా (YSR Kadapa District).. అది కూడీ ఏపీ సీఎం జగన్ మోహన్ (CM Jagan Mohan Reddy) రెడ్డి సొంత జిల్లా.. లో జరిగిన ఘటన తీవ్ర సంచలనం అవుతోంది. ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 15 మంది సామూహికంగా హిజ్రాపై అత్యాచారం చేసారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన కడప జిల్లాలోనే సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని కదిరి రహదారిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి సమీపంలో ఓ అరవై ఎల్లా హిజ్రాతో కలసి 35 ఏళ్ల మరో హిజ్రా ఉన్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో అటువైపుగా అనంతపురం జిల్లా కదిరికి వెళ్తున్న కార్లు హిజ్రాలను చూసి అకస్మాత్తుగా ఆగాయి. 35 ఏళ్ల హిజ్రాను టీజింగ్ చేస్తూ అల్లరి చేస్తూ వచ్చారు రెండు కార్లలలో వచ్చిన పదిహేను మంది ప్రయాణికులు. మొదట ఆ యువ హిజ్రాపై చేతులు వేస్తూ.... గిల్లుతూ వెకిలి చేష్టలు చేయ సాగారు. అకస్మాత్తుగా ఆమె పై లైంగిక దాడికి యత్నించారు.
ఆమె అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయింది. దీంతో అక్కడే ఉన్న వృద్ధ హిజ్రాను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తరువాత మరొకరు హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గట్టిగ అరుపులు కేకలు వేసిన సమీప ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కాపాడే నాధుడే లేదు. తరువాత అక్కడ నుంచి తప్పించుకున్న హిజ్రా.. తోటి హిజ్రాలను వెంట పెట్టుకొని ఘటన స్థలానికి చేరుకుంది. అత్యాచారానికి గురైన గాయపడ్డ ఆమెను చూసి.. వెంటనే దిశ యాప్ లో ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన స్పందించిన స్థానిక పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని అత్యా చారానికి పాల్పడిన వారిలో ఓ నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. హిజ్రాల ఫిర్యారు మేరకు దర్యాప్తు చేపట్టామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.విచారణలో వాస్తవాలు తెలుస్తాయని పులివెందుల పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : టీచర్ గా మారిన మంత్రి రజని..? గడప గడపకు అంటూ బిజీ బిజీ
మహిళకే కాదు ఈకాలంలొ హిజ్రాలకు కూడా రక్షణ కరువైందంటున్నారు హిజ్రాలు. లైంగిక దాడికి పాల్పడిన వారందరిని అదుపులోకి తీసుకోని కఠినమైన శిక్ష విధించాలని హిజ్రాలు కోరుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Gang rape, Kadapa