Home /News /andhra-pradesh /

AP POLITICS RAM GOPAL VARAM VS BJP FIGHT AGAINST RGV TWEETS ON PRESIDENT CANDIDATE DROUPADHI NGS

RGV vs BJP: పాండవులు ఎవరు? కౌరవులు ఎక్కడ? వర్మ ట్వీట్ వైరల్.. మానసిక వైద్యుడికి చూపించాలంటున్న బీజేపీ

Ram Gopal Varma/ Photo Twitter

Ram Gopal Varma/ Photo Twitter

RGV vs BJP: మొదట టీడీపీ.. ఆ తరువాత వైసీపీ.. ఇప్పుడు బీజేపీ.. ఇలా వరుసగా పార్టీలపై ట్వీట్లతో దాడి చేస్తున్నారు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తాజాగా వర్మ చేసిన ట్వీట్ తో పరిస్థితి.. బీజేపీపై మాటల యుద్ధానికి దారి తీసింది. దీంతో మరోసారి వరుస ట్వీట్లు చేశారు.

ఇంకా చదవండి ...
    RGV vs BJP: వివాదాస్పద దర్శకుడు రామ్‌‍‌‌ గోపాల్ వర్మ (Ram Goapal Varma) మరోసారి ట్వీట్ల యుద్ధం మొదలెట్టారు. ఇటీవల కాలంలో ఆయన ఏ పార్టీని వదలడం లేదు. మొదట తెలుగు దేశాన్ని.. తారువాత వైసీపీని.. ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశారు. ఒక్కో అంశంలో ఒక్కో పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చేవారు. తాజాగా ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో దర్శకుడు  వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయన ట్వీట్ పై బీజేపీ నేతలు (BJP Leaders) మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  (Somu Veerraju) అయితే.. వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు వర్మ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్ అయితే లక్ష్మణ రేఖ దాటొద్దు అంటూ హెచ్చరించారు కూడా.. ఇంతకీ వర్మ వ్యాఖ్యలపై ఎందుకింత దూమారం రేగుతోంది. ఆయన ఏమన్నారంటే..?

    ద్రౌపదీ పేరు తెరపైకి రాగానో ఆయన.. ట్విట్టర్లో స్పందించారు. ‘‘ ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే.. పాండవులు ఎవరు..? అని ఆయన ప్రశ్నించారు. అక్కడితోనే ఆగని ఆయన.. ముఖ్యంగా కౌరవులు ఎవరు..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ బీజేపీనేతలకు కోపం తెప్పించింది. దీంతో వర్మను టార్గెట్ చేస్తూ అతడిపి కేసులు నమోదు అవుతున్నాయి.



    రాష్ట్రపతి అభ్యర్ధి పేరును సెటైరికల్‌గా వాడటం అంటే.. రామ్ గోపాల్ వర్మ తన పరిధికి మించి వ్యవహరించారు అంటు మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. దీని కారణంగా వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ సైతం వర్మ తీరుపై మండిపడ్డారు.. లక్ష్మణ రేఖ దాటొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.



    ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. జులైలో సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం.. ఏవి? ఎప్పుడంటే?

    బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వర్మ మరోసారి దీనిపై స్పందించారు. తాను చేసిన ట్వీట్ తీవ్రస్థాయిలో వివాదం కావడంతో నాలిక కరుచుకున్నారు. మరో ట్వీట్ తో ఆ వివాదానికి ముంగింపు పలికే ప్రయత్నం చేశారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. మహాభారంతో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని మరో ట్వీట్ చేశారు. ద్రౌపది అనే పేరు చాలా అరుదుగా ఉంటుందని.. ఆ పేరు వినగానే ఆ పేరుతో ముడిపడిన ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని ట్వీట్ లో పేర్కొన్నారు. ఎవరి సెంటిమెంట్ ను తాను గాయపరచాలి అనుకోలేదు.

    వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్య హద్దును కూడా దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Ram Gopal Varma, RGV

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు