AP POLITICS RAGHURAMAKRISHNAM RAJU WRITES TO CBI TO QUESTON YCP MP VIJAYASAI REDDY IN YS VIVEKA MURDER CASE FULL DETAILS HERE PRN
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో సంచలనం.. సీపీఐకి రఘురామ లేఖ..
రఘురామకృష్ణంరాజు (ఫైల్)
వివేకా మర్డర్ కేసు (YS Viveka Murder Case) పై రఘురామ (MP Raghurama Krishnam Raju) సీబీఐ (CBI) కి లేఖరాయడం చర్చనీయాంశమవుతోంది. అందునా విజయసాయిని టార్గెట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల రఘురామరాజు రూ.1,100 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) సీబీఐకి లేఖరాసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradsh) రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (YS Viveka Murder Case) సంచలనం సృష్టించిందిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగుతుండగా.. సాక్ష్యులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల పేరుతో వచ్చిన ప్రచారం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఆరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama KrishnamRaju ఎంటర్ అయ్యారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలంటూ సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ కు రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. లేఖలో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ఒకరైతే వారి వెనుక మాస్టర్ మైండ్ ఉందన్నారు. పరిటాల రవి హత్య కేసు మాదిరిగానే ఇందులో కూడా నిందుతులు, కీలక సాక్ష్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైలుతో పాటు జైలు బయట ఉన్నవారికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు కూడా భంగం కలిగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వివేకా హత్య కేసు వెనుక మాస్టర్ మైండ్ ఉంది.. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని కూడా విచారించాలని లేఖలో కోరారు.
వివేకా మర్డర్ కేసుపై రఘురామ సీబీఐకి లేఖరాయడం చర్చనీయాంశమవుతోంది. అందునా విజయసాయిని టార్గెట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల రఘురామరాజు రూ.1,100 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి సీబీఐకి లేఖరాసిన సంగతి తెలిసిందే. అందుకు కౌంటర్ గానే రఘురామ కూడా సాయిరెడ్డిని ఇరుకున పెట్టేలా సీబీఐకి లేఖ రాశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన ఆ తర్వాత సీఎం జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రచ్చబండ పేరుతో ప్రతి రోజూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. దీంతో వైసీపీకి రఘురామరాజుకి మధ్య వైరం పెరిగింది. ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ట్రై చేస్తున్నా ఆయన మాత్రం చిక్కడం లేదు. అంతేకాదు గత నెల 5వ తేదీ వరకు అనర్హత వేటు వేయించాలని ఛాలెంజ్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా విజయసాయి సీబీఐకి లేఖరాయడంతో.. ఆయన కూడా వివేక హత్య కేసులో సాయిరెడ్డిని విచారించాలని సీబీఐ లేఖ రాసి తాను కూడా తగ్గేది లేదని పేర్కొన్నారు. అటు విజయసాయి, ఇటు రఘురామ లేఖల్లో సీబీఐ దేనికి స్పందిస్తుందో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.