Home /News /andhra-pradesh /

AP POLITICS PRIME MINSTER NARENDRA MODI TOUR FIXED THIS IS THE FULL SCHEDULE NGS

Narendra Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. రాష్ట్ర నేతలకు ఏం చెప్పనున్నారు..

ప్రధాని మోదీతో సీఎం జగన్

ప్రధాని మోదీతో సీఎం జగన్

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది.. ప్రస్తుతం ఏపీ పై బీజేపీ పూర్తిగా ఫోకస్ చేసింది. దీంతో ప్రస్తుతం మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. రాష్ట్ర నేతలతో ఆయన సమావేశం అవుతారా... అయితే రాజకీయంగా ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
    Narendra Modi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు కేంద్రం పూర్తి అన్యాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత.. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. విభజన హామీలు, ప్రత్యేక హోదా (Special Status) విషయంలో మొండి చేయి చూపిస్తోందన విమర్శలు ఉన్నాయి. ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కషాయ పార్టీ పై ప్రజల్లో కోపం కనిపించింది. పోటీలో ఉన్న ప్రతిసారి ఘోర ఓటమి తప్పడం లేదు. అందుకే ఈ సారి బీజేపీ (BJP) సరికొత్త వ్యూహంతో ఏపీలో పాగాకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను అందుకు అవకాశంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi AP tour). ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. మళ్లీ తెలంగాణకు రానున్నారు. ఆ వెంటనే ఏపీలో పర్యటించబోతున్నారు. పీఎం ఏపీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతి (Alluri Sitaramaraju 125th Birth Anninersary) వేడుకల్లో ఆయన పాల్గొన్ని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇది అధికారిక కార్యక్రమం. ప్రధాని హోదాలో ఆయన పాల్గొననున్నారు.

    జూలై 3న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆరాత్రికి అక్కడే బస చేసి జులై 4 ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం గం.10-50కి భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసగింస్తారు. ఆ తరువాత రాష్ట్ర బీజేపీ నేతల కోసం కొంత సమయం కేటాయించి.. వారిని కలుస్తారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో కూడా అదే జరిగింది. ISB వార్షికోత్స వేడుకల్ల పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని.. బేగంపేట ఎయిర్‌పోర్టులోనే బీజేపీ నేతలను కలిశారు. అనంతరం స్వాగత సభలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసగించారు. భీమవరం పర్యటన కూడా ఇంచుమించు ఇలానే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇదీ చదవండి : ఎద్దుల కుమ్ములాటలో న్యాయవాదికి గాయాలు.. కార్పొరేషన్ అధికారులపై కేసు

    2019 ఎన్నికల సమయంలో పలుమార్లు ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ. 2019లో ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో రాజమండ్రి సభకూ వచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. కేవలం రెండు సార్లు మాత్రమే ఏపీకి వచ్చారు ప్రధాని మోదీ. ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి రాగా.. మరోసారి షార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి.. కేవలం ఆయా కార్యక్రమాల్లో పాల్గొని.. తిగిరి వెళ్లిపోయారు. కానీ ఈ సారి రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీంతో ప్రధాని పర్యటన ఆసక్తి పెంచుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Modi, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు