Home /News /andhra-pradesh /

AP POLITICS PRIME MINSTER NARENDRA MOD BHEEMAVRAM TOUR TOMORROW BUT THERE IS PROBLEM WITH RAIN NGS VSP

PM Modi AP Tour: ప్రధాని పర్యటనకు అడ్డంకి.. భారీ వర్షంతో ఏర్పాట్లకు ఆటంకం.. ప్రముఖుల హాజరుపై అనుమానాలు.. భారీగా జనసమీకరణ

ప్రధాని మోదీ పర్యటనకు వర్షం అడ్డంకి

ప్రధాని మోదీ పర్యటనకు వర్షం అడ్డంకి

PM Modi AP Tour: ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. భారీ జనసమీకరణ కోసం ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు. సభ ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీగా ఉంటే.. వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు.. దీంతో సభకు అడ్డంకి తప్పదా అని భయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    PM Modi AP Tour: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు  (Alluri Sitaramaraju) 125వ జయంతిని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లోని భీమవరం (Bheemavaram) వేదికగా నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ (Prime Minster Modi) పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నరు. సభా వేదికకు ప్రధాని మోదీతో పాటు.. సీఎం జగన్ (CM Jagan) కూడా భీమవరం చేరుకోనున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో సభ ఏర్పాట్లకు అడ్డంకులు తప్పడం లేదు. భీమవరంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాని పర్యటన ఏర్పాట్లకు ఆటంకాలుతప్పడం లేదు. అయితే

    వర్షం ప్రభావంతో అక్కడ కటౌట్లు కూలిపోయాయి. మరోవైపు బహిరంగ సభకు ఏర్పాటు చేసిన షెడ్లలోకి భారీగా వాన నీరు చేరుకుంది. దీంతో నిర్వహాకుల్లో ఆందోళన నెలకొంది. రేపటి వరకు వాన కురిస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. వరుణుడా శాంచింది అంటూ స్థానిక నేతలు.. అధికారులు వేడుకుంటున్నారు. అయితే చినుకులను కూడా లెక్క చేయకుండా కొందరు సభ ఏర్పాట్లో బిజీ అవుతున్నారు. సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఆరాటపడుతున్నారు. భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెద అమిరంలో.. 16 ఎకరాల్లో భారీ వేదిక ఏర్పాటు చేశారు. వాన తగ్గిన పనులు దాదాపు తుది దశకు చేరినట్టే.. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అక్కడే సభ ఏర్పాటు చేసారు. 

    ఒకవేళ రేపు భారీ వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంగా ప్రత్యామ్నాయ చర్యలు సైతం చేబడుతున్నారు అధికారులు. వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల వరకు ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్దం చేసారు. ప్రధాని రాకపోకలకు వీలుగా నాలుగు హెలిప్యాడ్లు సిద్దం అయ్యాయి. ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక బీజేపీ నతలు, అధికారులు.. ప్రధాని వేదికతో పాటుగా సమీపంలోనే మరో వేదిక సిద్దం చేసారు. ఆ వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    ఇదీ చదవండి : పుత్రికోత్సాహంతో సీఎం.. పారిస్ నుంచి తిరిగి ఏపీ చేరుకున్న జగన్

    వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను సైతం ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక, ప్రయివేటు సంస్థల నుంచి సేకరించిన మరో ఏడు వేల బస్సులను జన సమీకరణకు వినియోగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాలు.. ప్రవాసాంధ్రులు సైతం భారీగా తరలి వస్తారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్ట ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

    ఇదీ చదవండి : విజయవాడ కనక దుర్గమ్మకు బంగారం బోనం.. ప్రత్యేకత ఏంటంటే..?

    మరోవైపు ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారనే దానిపై ఇప్పటిక స్పష్టత వచ్చింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి సొంత జిల్లా కావటంత పాటుగా. .కేంద్రం నుంచి ఆహ్వానం అందటం.. అల్లూరి సీతారామ రాజు కార్యక్రమం కావటంతో.. ఆయన హాజరు అవుతునాని ఇప్పటికే సమాచారం అందించినట్టు సమాచారం. ఈ సమయంలోనే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు