Home /News /andhra-pradesh /

AP POLITICS PRIME MINSTER MODI GAVE IMPORTANCE TO AP CM JAGAN MOHAN REDDY IN DELHI WHAT IS THE REASON NGS

CM Jagan: హస్తినలో సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రాధాన్యత పెరిగిందా? మోదీ లంచ్ భేటీ లెక్క ఏంటి?

సీఎం జగన్ భుజం తట్టిన మోదీ

సీఎం జగన్ భుజం తట్టిన మోదీ

Modi–Jagan Lunch: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్ ఎన్డీఏ భాగస్వామి కాదు.. ప్రత్యేకంగా జగన్ తో కలిసి ప్రధాని మోదీ మాట్లాడారు.. భుజం తట్టి అభినందించారు. దీంతో ఆయనకు హస్తినలో ప్రధాన్యత పెరుగుతోందనే చర్చ మొదలైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  Modi–Jagan Lunch: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి హస్తిన రాజకీయాల్లో ప్రాధాన్యత పెరుగుతోంది. సీఎం జగన్ ఎన్డీఏ భాగస్వామి కాదు.. అయిన బీజేపీ మిత్ర పక్ష పార్టీల కంటే అన్ని విషయాల్లో కేంద్రానికి అండగా ఉంటున్నారు. ఆర్థిక ఏపీ కష్టాల్లో ఉంది.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అయినా దానిపై ఎప్పుడూ బీజేపీ  (BJP) పెద్దలను నిలదీయలేదు. కేంద్ర ప్రభుత్వం (Central Government) తో సఖ్యతగా ఉంటున్నారు. కరోనా (Corona) కష్టకాలంలోనూ కేంద్రంకు అనుకూలంగా మాట్లాడారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల సీఎంలకు సైతం ప్రధానికి సహకరించాలని కోరుతూ లేఖలు రాశారు.. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల (President Elections) సమయంలో.. వైసీపీ (YCP) మద్దతు తప్పనిసరి అయ్యింది. తన అవసరం ఉందని తెలిసినా.. జగన్ ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే ఎన్డీఏ రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.. వారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరింత ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటికే పలుమార్లు జగన్‌తో స్వయంగా మాట్లాడిన ప్రధాని.. తాజాగా జగన్‌తో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

  తాజాగా నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం దానికి వేదికైంది. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు, కీలక అధికారులు హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు కీలక చర్చలు జరిగాయి. అయితే ఈ సమావేశం అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  స్వయంగా ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్‌ లంచ్‌ చేశారు. దాదాపు ఒంటి గంట నుంచి రెండు వరకూ భోజన కార్యక్రమం కొనసాగింది. ఆ సమయంలో ప్రధాని మోదీ సీఎంతో పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. ప్రభుత్వ నిర్ణయాలు.. సంక్షేమ పథకాలు, విడుదల చేయాల్సిన నిధుల గురించి ప్రధానితో.. స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. నీతి ఆయోగ్‌ సమావేశానికి బీజేపీ అధికారంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరైనప్పటికీ.. ప్రధాని మోదీ వారిని కాదని జగన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం హస్తిన రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.

  ఇదీ చదవండి : భర్తను బతికిస్తానని సోది చెప్పిన వ్యక్తి వలలో పడ్డ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే?

  ప్రధాని మోదీ కూర్చున్న లంచ్‌ టేబుల్‌పైనే.. సీఎం వైఎస్‌ జగన్‌, రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్, అసోం సీఎం హిమంత్‌ బిశ్వాస్‌ శర్మ, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూర్చున్నారు. ఆ రకంగా ప్రధాని మోదీ.. సీఎం జగన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం.. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్ గా మారింది. విపక్షాలను ఏకం చేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికారంలో ప్రధాని మోదీ జగన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

  ఇదీ చదవండి : ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?

  దేశ రాజకీయాల్లో వైసీపీ వైఖరి కారణంగా ఈ అవకాశం లభించినట్లు పార్టీ ప్రముఖులు చెబుతున్నారు. ఒకే టేబుల్‌పై ప్రధాని మోడీతో కలిసి జగన్‌ను కూర్చొని లంచ్‌ చేయడం.. వైసీపీ అధినేతకు హస్తిన రాజకీయాల్లో పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబుకు జాతీయ రాజకీయాల్లో లభించిన గుర్తింపు ఇప్పుడు జగన్‌కు వస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Narendra modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు